Ears: ఐదేళ్ల తర్వాత.. చెవులొచ్చాయ్.! వైద్య చరిత్రలో అప్పుడప్పుడూ కొన్ని చిత్రమైన కేసుల్లో ఇది ఒకటి..
వైద్య చరిత్రలో అప్పుడప్పుడూ కొన్ని చిత్రమైన కేసులు వెలుగుచూస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి పోయాయి అనుకున్న చెవులు ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చాయి. ఏకంగా ఐదేళ్లపాటు అతని చెవులు వినిపించకుండా పోయాయి.
ఇంగ్లండ్‌కు చెందిన వాలెస్ లీ గత కొంతకాలంగా వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. అతను ఏవియేషన్ పరిశ్రమలో పని చేస్తుంటాడు. అందువల్లనే అతనికి వినికిడి సమస్య వచ్చి ఉండచ్చని భావించారు. లేదా రగ్బీ మ్యాచ్‌ల సమయంలో ప్రమాదవశాత్తూ తగిలిన గాయాల వల్లనో అలా జరిగి ఉండొచ్చని అనుకున్నాడు 66 ఏళ్ల ఆ పెద్దాయన. అయితే అతనికి రోజు రోజుకీ వినికిడి శక్తి తగ్గిపోతుండటంతో వస్తుండడంతో ఆయన భార్య ఆందోళన చెంది వైద్యులను కలవడం మంచిదనుకుంది. ఈ క్రమంలో డాక్టర్‌ను కలిసే ముందు హోం ఎండోస్కోప్ కిట్‌ను కొనుగోలు చేసి.. చెవిని పరీక్షించగా, చెవి లోపల తెల్లగా ఓ చిన్న వస్తువు కనిపించింది. దాంతో వారు ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ను కలిసి ఆ తెల్లటి వస్తువును బయటకు తీసే యత్నం చేశారు. అయితే చెవిలో గులిమి మధ్య అది ఇరుక్కుపోవడంతో బయటకు తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. అప్పుడు ఓ చిన్నిపైపును చెవిలోకి జొప్పించి.. పంపింగ్ ద్వారా ఆ వస్తువును విజయవంతంగా బయటకు తీసారు. అది బయటకు వచ్చిన మరుక్షణమే ఆ చిట్టిబాబు ప్రతీ సౌండ్‌ను క్లియర్‌గా వినగలిగారట!. ఐదేళ్ల కిందట.. ఆస్ట్రేలియా ట్రిప్‌కు వెళ్తున్న సమయంలో.. పాత ఇయర్‌బడ్ ముక్క చెవిలోకి దూరి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఆ టూర్ తర్వాతే ఆయన చెవులు క్రమక్రమంగా వినిపించడం ఆగిపోయిందట!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

