Bird Video: రూటు మార్చిన పక్షులు.. వీటి తెలివికి ఇంజినీర్లు సైతం నోరెళ్లబెట్టాల్సిందే..
ప్రపంచం సాంకేతికంగా ఎత అభివృద్ధి చెందినా దాని మూలాలు మాత్రం ప్రకృతి ఒడిలోనే ఉన్నాయి. ప్రకృతి ముందు ఏదీ నిలవలేదు. ఈ విశాల విశ్వంలో చాలా రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఒకేసారి తెలుసుకోవడం...
ప్రపంచం సాంకేతికంగా ఎత అభివృద్ధి చెందినా దాని మూలాలు మాత్రం ప్రకృతి ఒడిలోనే ఉన్నాయి. ప్రకృతి ముందు ఏదీ నిలవలేదు. ఈ విశాల విశ్వంలో చాలా రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఒకేసారి తెలుసుకోవడం సాధ్యం కాని ప ని. ప్రతిసారీ ఏదో ఒకటి తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. ఇల్లు కట్టుకోవడమనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కల. అది మనిషి అయినా, జంతువు అయినా, పక్షి అయినా అందరికి ఒకే కల ఉంటుంది. పక్షుల గురించి చెప్పాలంటే.. గడ్డి, కర్ర పుల్లలు, దూది వంటి పదార్థాలతో పక్షులు చక్కగా గూడు కట్టుకుంటాయి. అయితే మారుతున్న కాలాన్ని బట్టి అవి కూడా సెపరేట్ రూట్ ను ఎంచుకుంటున్నాయి. అవి తమ గూడును మానవుడి గృహంలా బలంగా తయారు చేసుకోవడం నేర్చుకున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో రెండు పక్షులు గూడు కట్టుకోవడాన్ని మీరు చూడవచ్చు. వాటి పనితనాన్ని స్పష్టంగా చూపిస్తాయి. అవి ఎంతో శ్రమించి, వేగంగా గూడును కట్టుకుంటాయి. గూడు పూర్తయిన తర్వాత ఆ పక్షి ముఖంలో వచ్చే ఆనందాన్ని చెప్పేందుకు మాటలు చాలడం లేదు. వీడియోలో కనిపించే పక్షి పేరు ఓవెన్‌బర్డ్ అని నిపుణులు చెబుతున్నారు. దీని శాస్త్రీయ నామం ఫర్నేరియస్ రూఫస్. దక్షిణ అమెరికాలోని గడ్డి భూముల్లో విస్తృతంగా కనిపిస్తుంది. ఈ పక్షి ఓవెన్ ఆకారంలో గూడును తయారు చేస్తుంది.
Ovenbird building a clay nest timelapse pic.twitter.com/MVt1wTw1qD
— Daniel Cleland (@pulsedaniel) June 27, 2017
ఈ వీడియోను సోషల్ మీడియా మా్ధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు నాలుగు లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. చాలా శ్రమతో పక్షి తన గూడును తయారు చేస్తుందని ఓ యూజర్, అద్భుతమైన ట్రిక్, ఇంజనీర్లు కూడా ఇలాంటి ఇళ్లను ఇలా నిర్మించలేరని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం