Russia Ukraine War: ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని సడన్ టూర్.. జెలెన్‌స్కీతో రిషి సునాక్ భేటీ.. అండగా ఉంటానంటూ భరోసా
ఉక్రెయిన్ గెలిచే వరకు మద్దతిస్తాం..రష్యాతో పోరులో అండగా ఉంటాం..అంటూ జెలెన్‌స్కీకి భరోసా ఇచ్చారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. కీవ్‌లో జెలెన్‌స్కీతో కీలక సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్ కొత్త ఎయిర్ డిఫెన్స్ ప్యాకేజీని ప్రకటించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. రష్యా దాడిలో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..సునాక్ ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. సడెన్‌గా కీవ్‌లో ప్రత్యక్షమయ్యారాయన. అన్ని విధాలుగా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని జెలెన్‌స్కీకి భరోసా ఇచ్చారు. ఇరాన్ డ్రోన్‌లను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు 125 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్నులిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ గెలిచే వరకు మద్దతిస్తామన్నారు. 50మిలియన్ల STG ప్యాకేజ్ లేదంటే వైమానిక రక్షణను అందిస్తామని చెప్పారు రిషి సునాక్.
రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ పౌరులను, జాతీయ మౌలిక సదుపాయాలను రక్షించడంలో సహాయపడటానికి కొత్త ప్యాకేజీని అందిస్తామని ప్రకటించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడటం అంటే ఏంటో బ్రిటన్‌కు తెలుసన్నారు సునాక్. రెండు దేశాల మధ్య సంబంధాలతో పాటు ప్రపంచ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశాలపై చర్చించామన్నారు.
ఇక ఇప్పటికే కీవ్‌కు 2.3 బిలియన్ పౌండ్ల సైనిక సహాయాన్ని అందించింది బ్రిటన్. తన నాయకత్వంలోనూ ఎటువంటి మార్పు ఉండదని ఉక్రెయిన్ నాయకులకు భరోసా ఇచ్చారు. దీంతో మీలాంటి స్నేహితులు మా పక్కన ఉన్నందున..విజయంపై తమకు గట్టి నమ్మకముందని ట్వీట్ చేశారు జెలెన్స్కీ. స్వాతంత్రం కోసం నిలబడటమంటే ఏంటో రెండు దేశాలకూ తెలుసన్నారు. ఇక రిషి సునాక్ గత నెలలో బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం