Weight Loss Diet: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఓ సారి ఈ డైట్‌ను ట్రై చేయండి..
బరువు తగ్గడం కోసం చాలా మంది ఎన్నో రకాల డైట్‌లు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల డైట్‌లు మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని అనుకున్న రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. కాని లో-కార్బ్, హై ప్రోటీన్ డైట్ బరువు తగ్గాలనుకునే వారికి, శరీర ధృడత్వాన్ని కోరుకునే వారికి మంచిదని నిపుణులు..
బరువు తగ్గడం కోసం చాలా మంది ఎన్నో రకాల డైట్‌లు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల డైట్‌లు మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని అనుకున్న రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. కాని లో-కార్బ్, హై ప్రోటీన్ డైట్ బరువు తగ్గాలనుకునే వారికి, శరీర ధృడత్వాన్ని కోరుకునే వారికి మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ రకమైన డైట్‌తో షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలో ఉంటాయంటున్నారు. కార్బోహైడ్రేట్ని తక్కువ తీసుకుంటే.. శరీరంలో గ్లూకోజెన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఫ్యాట్ బర్నింగ్ వేగంగా జరుగుతుందని సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా ఈ డైట్ ఫాలో అయితే.. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఫలితాలు ఇస్తోందంటున్నారు నిపుణులు. హై ప్రోటీన్ డైట్‌తో ఎక్సర్సైజ్లు చేస్తే.. వెయిట్‌లాస్ కావడంతో పాటు లీన్ మజిల్ మాస్ కూడా పెరుగుతుంది. కొన్ని రకాల కార్బ్, హై ప్రోటీన్ ఆహారాల గురించి తెలుసుకుందాం.
గ్రీక్ యోగర్ట్
కొన్నిసార్లు ఆకలి వేయకపోయినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఏది బడితే అది తింటే .. వెయిట్‌లాస్ ప్రోగ్రాం దెబ్బతింటుంది. ఈ సమయంలో గ్రీక్ యోగర్ట్ చాలా ఉపయోగపడుతుంది. సాధారణ పెరుగు కన్నా ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఈ రిచ్ ప్రోటీన్ సోర్స్‌తో క్రేవింగ్స్‌ని నియంత్రించుకోవచ్చు. పొట్ట ఉబ్బడాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. దీనిలో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్‌తో పాటు ఎన్నో అవసరమైన పోషకాలు ఉన్నాయి.
సన్‌ఫ్లవర్ సీడ్స్
సన్ ఫ్లవర్ సీడ్స్‌ను పొద్దుతిరుగుడు గింజలు అని కూడా అంటారు. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే.. ఈ సీడ్స్ మంచి ఎంపిక. వీటిలో ప్రోటీన్, ఫైబర్‌తో పాటు విటమిన్ ఈ, కాపర్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. సలాడ్లు, క్రీమ్స్, పచ్చి కూరగాయలపై టాపింగ్స్‌గా కూడా వేసుకుని వీటిని తినొచ్చు. ఈ సీడ్స్‌ని తినడం వల్ల డైమెన్షియా వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
సాల్మన్
సాల్మన్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే ఎంతో ఆరోగ్యకరం, బరువు తగ్గాలనుకునేవారికి మంచి డైట్ అవుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. పొత్తికడుపులోని కొవ్వును తగ్గిస్తుంది. లీన్ మజిల్ టిష్యూ ఎదుగుదలకు.. ఇది ఎంతో ముఖ్యమైన మాక్రోన్యూట్రీషియన్గా ఉంటుంది. మూడు ఔన్స్‌ల సాల్మన్‌ని తీసుకుంటే.. 108 క్యాలరీలు, 17 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
రోస్టెడ్ చిక్పీస్
వేయించిన శెనగలను రోస్టెడ్ చిక్పీస్ అంటారు. వీటిలో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. ఇదొక హై ప్రోటీన్, ఫైబర్ పదార్థం. వెయిట్‌లాస్‌లో ఉన్న వారు కచ్చితంగా ట్రై చేయాల్సిన ఆహార పదార్థంగా చెప్పుకోవచ్చు. వీటిని ఎందులోనైనా కలుపుకుని తినేయవచ్చు. మొత్తానికి బరువు తగ్గాలనుకునేవారు హై ప్రోటీన్ డైట్‌ను ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..