Weight Loss: వీటిని రెగ్యులర్‌గా తింటే వేగంగా బరువు తగ్గుతారు.. చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందే

అధిక బరువును తగ్గించుకోవడానికి రెగ్యులర్ వ్యాయామం మాత్రమే సరిపోదు. డైట్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీని కోసం మీరు మంచి డైట్ ప్లాన్‌ని తయారు చేసుకోవాలి. దానిని క్రమం తప్పకుండా పాటించాలి.

Weight Loss: వీటిని రెగ్యులర్‌గా తింటే వేగంగా బరువు తగ్గుతారు.. చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందే
Weight Loss Food
Follow us
Basha Shek

|

Updated on: Nov 19, 2022 | 7:55 AM

ఒకరు లావుగా కనిపించడానికి లేదా బరువు పెరగడానికి కారణమేమిటో కనుక్కోవడం అంత సులభమేమీ కాదు . బరువు పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. క్రమరహిత జీవనశైలి ( చెడు జీవనశైలి ), పోషకాహారం లేకపోవడం, ధూమపానం అలవాటు, థైరాయిడ్, మధుమేహం, జన్యుశాస్త్రం లేదా బలహీనమైన జీవక్రియ వంటి వ్యాధులు బరువు పెరగడానికి కారణాలుగా పేర్కొంటారు. ఇక అధిక బరువును తగ్గించుకోవడానికి రెగ్యులర్ వ్యాయామం మాత్రమే సరిపోదు. డైట్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీని కోసం మీరు మంచి డైట్ ప్లాన్‌ని తయారు చేసుకోవాలి. దానిని క్రమం తప్పకుండా పాటించాలి. బరువు తగ్గించుకోవడానికి ( వెయిట్ లాస్ ఫుడ్ ) రెగ్యులర్ గా తినే కొన్ని ఆహారా పదార్థాలు ఉన్నాయని మీకు తెలుసా ? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

పనీర్‌

పనీర్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యా్‌ల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక ప్రతి 100 గ్రాముల పనీర్‌లో దాదాపు 335 కేలరీలు ఉంటాయి. దీనిని తీసుకుంటే కడుపు నిండుగా ఉన్న భావన ఉంటుంది. చాలా సేపటి వరకు కానీ ఆకలి వేయదు.

గుడ్లు

గుడ్లలో కూడా ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన విటమిన్లు కూడా ఉంటాయి. అల్పాహారంగా గుడ్లు తినడం మంచిది. దీన్ని తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

మూంగ్‌ దాల్‌

ముంగ్ దాల్‌ లేదా పెసర పప్పులో కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, మీరు తప్పనిసరిగా మూంగ్ దాల్‌ తీసుకోవాలి. వీటిని సలాడ్‌లో కలిపి తినడం వల్ల మీరు ఆరోగ్యంగా అలాగే ఫిట్‌గా ఉంటారు. ఒక కప్పు ముంగ్ బీన్స్‌లో దాదాపు 26 కేలరీలు ఉంటాయి.

నారింజ పండ్లు

నారింజ పండ్లు కూడా బరువు నియంత్రణలో సహాయపడుతాయి. శీతాకాలంలో ఈ పండు పుష్కలంగా లభిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ నారింజ పండు తినండి. ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజలో కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. వీటిని తిన్నా జ్యూస్‌ చేసుకుని తాగినా బరువు పెరగరు. పైగా ఇందులోని పోషకాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

పసుపు

వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో పసుపు కూడా ఒకటి. ఇందులో కర్కుమిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాల నుండి కొవ్వును తగ్గిస్తుంది. దీని వల్ల కూడా బరువు తగ్గవచ్చు. ఒక టీస్పూన్ పసుపులో దాదాపు 8 కేలరీలు ఉంటాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో