Secunderabad: నాలాలో పడిన బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం.. ప్రకటించిన మంత్రి తలసాని ..
సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్ కలాసిగుడ నాలాలో పడి మరణించిన చిన్నారి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పరామర్శించారు. కింద పడిన తన సోదరుడిని కాపాడే ప్రయత్నంలో చిన్నారి..
సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్ కలాసిగుడ నాలాలో పడి మరణించిన చిన్నారి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పరామర్శించారు. కింద పడిన తన సోదరుడిని కాపాడే ప్రయత్నంలో చిన్నారి నాలాలో పడిపోయి మరణించడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ చిన్నారి చనిపోవడం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
అలాగే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా బాలిక కుటుంబాన్ని పరామర్శించి, జీహెచ్‌ఎంసీ నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతకముందు బాలిక మృతి గురించి సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..