Pakistan: మితిమీరుతున్న ‘పాక్’ అకృత్యాలు.. వైరల్ ఫోటోపై క్లారిటీ..
మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో నిత్యం మైనారిటీలపై, వారిలోని మహిళలపై మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఆ దేశంలో చనిపోయిన వారిపై కూడా దాడులు జరుగుతున్నాయని, ఫలితంగా నెక్రోఫిలియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని పలు కథనాలు..
మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో నిత్యం మైనారిటీలపై, వారిలోని మహిళలపై మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఆ దేశంలో చనిపోయిన వారిపై కూడా దాడులు జరుగుతున్నాయని, ఫలితంగా నెక్రోఫిలియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని పలు కథనాలు వెలువడ్డాయి. నిజానికి నెక్రోఫిలియా అంటే చనిపోయిన మహిళల మృతదేహాలను రేప్ చేయడం, లైంగిక కోరికలు తీర్చుకోవడం. ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఇంకా కరాచీకి చెందిన ముహమ్మద్ రిజ్వాన్ వ్యక్తి శ్మశానవాటికలోని 48 మహిళల శవాలపై అత్యాచారం చేసినట్లు 2011లో ఒప్పుకున్నాడు. అలాగే 2020 ఫిబ్రవరి నెలలో అష్రాఫ్ అనే వ్యక్తి ఒక మహిళ శవాన్ని రేప్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి అరెస్టు అయ్యాడు. ఇటీవలే గతేడాది మే నెలలో కూడా గుజరాత్(పాకిస్థాన్)లోని చక్ కమలా గ్రామంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు టీనేజ్ బాలిక శవాన్ని తవ్వి, అత్యాచారం చేశారు. కుటుంబీకులు మృతదేశానికి అంత్యక్రియలు చేసిన రోజు రాత్రి ఈ అకృత్యం జరిగింది. ఇలా నెక్రోఫిలియా ఘటనలు వందలాది సంఖ్యలో నమోదవుతున్న క్రమంలో చనిపోయిన మహిళల కుటుంబీకులు వారి శవాలకు తాళాలు వేస్తున్నారు.
(ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఓ సమాధికి తాళం వేసినట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కామాంధుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ తండ్రి ఇలా తన కూతురు సమాధికి తాళం ఏర్పాటు చేశారన్నది ఆ వైరల్ ట్వీట్ సారాంశం. అయితే పలు జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ కథనాన్ని ప్రచురించాయి. అయితే ఇది పాకిస్థాన్‌కి చెందిన ఫోటో కాదని, మన హైదరాబాద్‌లోనిదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఇతరులెవరు కూడా తమ వారి సమాధిని తవ్వి అదే స్థానంలో వేరువారి భౌతిర కాయాన్ని ఖననం చేయకుండా ఉండేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోంది.)
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..