AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno Spark 10: బడ్జెట్ ధరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే కళ్లు జిగేల్ అనడం ఖాయం.. పూర్తి వివరాలివే..

Tecno Spark 10: స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో అత్యంత బడ్జెట్ ధర కలిగిన మొబైల్స్‌కు పేరుగాంచిన టెక్నో కంపెనీ.. ఇప్పుడు అతి తక్కువ ధరకే మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. టెక్నో కంపెనీ తీసుకొస్తున్న టెక్నో స్పార్క్ 10 4జీ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో

Tecno Spark 10: బడ్జెట్ ధరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే కళ్లు జిగేల్ అనడం ఖాయం.. పూర్తి వివరాలివే..
Tecno Spark 10 4g
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 28, 2023 | 1:07 PM

Share

Tecno Spark 10: స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో అత్యంత బడ్జెట్ ధర కలిగిన మొబైల్స్‌కు పేరుగాంచిన టెక్నో కంపెనీ.. ఇప్పుడు అతి తక్కువ ధరకే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. టెక్నో కంపెనీ తీసుకొస్తున్న టెక్నో స్పార్క్ 10 4జీ(Tecno Spark 10 4G) ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ దీర్ఘకాలం ఉండే బాంబే బ్యాటరీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారితమైన డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఈ ఫోన్‌లోని మరో హైలైట్. అసలు ఈ ఫోన్ ధర, ఇందులోని ఫీచర్లు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

టెక్నో స్పార్క్ 10 4జీ స్మార్ట్‌ఫోన్ ఇంకా భారత్‌లోకి ప్రవేశించనప్పటికీ దీని ధర రూ.15 వేల లోపు ఉండవచ్చని అంచనా. మెటా వైట్, మెటా బ్లూ, మెటా బ్లాక్ రంగులలో ఆవిష్కరించబడిన ఈ స్మార్ట్‌ఫోన్ 720 x 1612 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో పాటు 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ధరల వారీగా టెక్నో స్పార్క్ 10 4G స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 సపోర్ట్‌తో పని చేస్తుంది.

మరో విశేషమేమిటంటే, ఈ ఫోన్‌లోని వర్చువల్ ర్యామ్‌ను 8GB వరకు పెంచుకోవచ్చు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, AI సెన్సార్ రూపంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అంతేకాక సెల్ఫీలు,వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ AI-సప్పోర్టెడ్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5,000 mAh బ్యాటరీ, 18W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్ధతు కూడా లభిస్తుంది. అయితే ఈ ఫోన్‌లో 5జీ కనెక్టివిటీకి సప్పోర్ట్ లేదు. డ్యూయల్ సిమ్, 4G, వైఫై, బ్లూటూత్, NFC, GPS వైఫై, USB C పోర్ట్‌లకు అయితే మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..