AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postpaid Plans: పోస్ట్‌పెయిడ్‌లోనూ పోటీనే.. అతి తక్కువ ధరలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఇచ్చేవి ఇవే..

ఇటీవల కాలంలో పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధరల వల్ల మళ్లీ ప్రజలు పోస్ట్ పెయిడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అపరిమిత డేటాతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి టెలికాం కంపెనీలు వివిధ అవసరాలను తీర్చడానికి సరసమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

Postpaid Plans: పోస్ట్‌పెయిడ్‌లోనూ పోటీనే.. అతి తక్కువ ధరలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఇచ్చేవి ఇవే..
Airtel, Jio And Vodafone Idea
Nikhil
|

Updated on: Apr 28, 2023 | 3:30 PM

Share

ఒకప్పుడు భారతదేశంలో పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్‌లు ఎక్కువగా వాడేవారు. క్రమేపి అధిక టారిఫ్‌ల కారణంగా ప్రజలు వాటికి దూరమయ్యారు. ఇటీవల కాలంలో పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధరల వల్ల మళ్లీ ప్రజలు పోస్ట్ పెయిడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అపరిమిత డేటాతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి టెలికాం కంపెనీలు వివిధ అవసరాలను తీర్చడానికి సరసమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే వాటిలో అత్యంత తక్కువ ఖర్చుతో వచ్చే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఏమి ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

జియో రూ.599 ప్లాన్

అపరిమిత డేటాతో జియో నుంచి అత్యంత సరసమైన ప్యాకేజీగా రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌తో, మీరు అపరిమిత మొబైల్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. వినియోగదారులు జియో టీవీ, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సేవలను ఉచితంగా పొందవచ్చు. 

వీఐ రూ.701

వీఐ నుంచి ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అపరిమిత డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌తో వస్తుంది. అదనంగా వినియోగదారులు ప్రతి నెలా 3,000 ఎస్ఎంఎస్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. అలాగే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఒక సంవత్సరం విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ యాక్సెస్, వీఐ సినిమాలు, టీవీ యాప్‌లకు వీఐపీ యాక్సెస్, జీ5 ప్రీమియం సినిమాలు, ఒరిజినల్ టీవీ షోలకు యాక్సెస్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వీఐ యాప్‌లో అపరిమిత డౌన్‌లోడ్‌లతో నెలల తరబడి యాడ్-రహిత హంగామా సంగీతం కూడా ఆశ్వాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ భారతదేశంలోని తన వినియోగదారుల కోసం అపరిమిత 5 జీ డేటాతో అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. అత్యల్ప ప్లాన్ రూ.499తో ప్రారంభమవుతుంది. ఇది 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. తదుపరి రెండు ప్లాన్‌లు రూ.839, రూ.999గా ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్‌లో అత్యధిక పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ.3395గా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..