Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అయ్యో..! నిలుచుని నిద్రపోతున్న బుజ్జి కోడిపిల్ల.. ఎంత ముద్దుగుందో.. వైరల్ అవుతున్న వీడియో..

ఎరికైనా నిద్ర అనేది చాలా ముఖ్యం. సరిపడినంతగా నిద్ర లేకపోతే  మరుసటి రోజు శరీరమంతా నొప్పులు, పగలంతా నిద్రలో తల ఊగడం అనేవి సహజం. ఇలా ఎవరైనా నిద్ర మత్తలో తల ఊపుతూ.. ఆ వెంటనే మళ్లీ తెరుకుంటూ ఉంటే చూడడానికి ఎంతో..

Watch Video: అయ్యో..! నిలుచుని నిద్రపోతున్న బుజ్జి కోడిపిల్ల.. ఎంత ముద్దుగుందో.. వైరల్ అవుతున్న వీడియో..
Chicks Taking Nap
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 28, 2023 | 11:33 AM

ఎరికైనా నిద్ర అనేది చాలా ముఖ్యం. సరిపడినంతగా నిద్ర లేకపోతే  మరుసటి రోజు శరీరమంతా నొప్పులు, పగలంతా నిద్రలో తల ఊగడం అనేవి సహజం. ఇలా ఎవరైనా నిద్ర మత్తలో తల ఊపుతూ.. ఆ వెంటనే మళ్లీ తెరుకుంటూ ఉంటే చూడడానికి ఎంతో సరదాగా ఉంటుంది. అయితే అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అందులో నిద్ర మత్తుతో బాధపడుతున్నది మనిషి కానే కాదు.. ఓ చిన్న కోడిపిల్ల. దాని నిద్రకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు తెగ పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు. ఇంకా కొందరు నెటిజన్లు తమ కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఆ వీడియోలో చాలా కోడి పిల్లలు కనిపిస్తుంటాయి. అవన్నీ తమ తమ పనులలో బిజీగా ఉండగా.. ఓ చిన్న కోడిపిల్ల మాత్రం నిలబడి నిద్రమత్తులో ఊగుతోంది. అంతేనా తన తలను నేలకు ఆనించి అలాగే పడుకుని ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కెమెరాలో బంధించిన హఫ్సా సలీమ్ అనే ఇన్‌స్టా యూజర్ తన ఖాతాలోనే షేర్ చేసింది. అలా నెటిజన్ల ముందుకు వచ్చిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..