AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: స్త్రీలోని ఈ లక్షణాలే పురుషుడిని తలవంచేలా చేస్తాయి.. లిస్టులలో ఏయే గుణాలు ఉన్నాయంటే..?

Chanakya Niti: కాబోయే భర్త కోసం అమ్మాయిలకు కొన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లుగానే..  చాలా మంది పురుషుల మనసులో కూడా తమ భార్యలో కొన్ని రకాల లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో పురుషులు కొన్ని రకాల లక్షణాలు ఉన్న అమ్మాయిలకు..

Chanakya Niti: స్త్రీలోని ఈ లక్షణాలే పురుషుడిని తలవంచేలా చేస్తాయి.. లిస్టులలో ఏయే గుణాలు ఉన్నాయంటే..?
Chanakya Neeti
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 28, 2023 | 12:44 PM

Share

Chanakya Niti: కాబోయే భర్త కోసం అమ్మాయిలకు కొన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లుగానే..  చాలా మంది పురుషుల మనసులో కూడా తమ భార్యలో కొన్ని రకాల లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో పురుషులు కొన్ని రకాల లక్షణాలు ఉన్న అమ్మాయిలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతారని ఆచార్య చాణక్యుడు వివరించాడు. చాణక్యుడు స్వతహాగానే గొప్ప పండితుదు, నీతి కోవిదులు, అపర మేధావి. ఆయన తన నీతి శాస్త్రంలో చెప్పిన విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేదు. నేటికీ, ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రభావవంతంగా ఉన్నాయి. మరి అలాంటి చాణక్యుడు పురుషులకు ఇష్టమైన స్త్రీలోని ఏయే  లక్షణాల గురించి చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ధైర్యం గల స్త్రీ: చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నట్లుగా, పురుషులను ప్రత్యేకంగా ఆకర్షించే కొన్ని లక్షణాలు మహిళల్లో ఉన్నాయి. చాణక్యుడి ప్రకారం పురుషుల కంటే మహిళలు చాలా ధైర్యంగా ఉంటారు. స్త్రీలకు ధైర్యసాహసాలు ఉంటే ఇంట్లోని వ్యక్తులు ఎన్నో కష్టాల్ని అధిగమిస్తారు. ఆ కారణంగానే స్త్రీలోని ధైర్యం పురుషుడిని ఆకర్షిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు.

సహనం గల స్త్రీ: తమ జీవితంలో ఎటువంటి కష్టనష్టాలు ఏర్పడినా.. ఏ సందర్భంలోనైనా సహనం పాటించే స్త్రీలు జీవితంలో ఎప్పుడూ విఫలం కారు. ఓర్పు, సహనం కలిగిన మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎప్పుడు విజయాన్ని సొంతం చేసుకుంటాడు. అందుకే అలాంటి సహనం గల స్త్రీలు పురుషులను ఎక్కువగా ఆకర్షిస్తారని చాణక్యుడు వివరించాడు.

ఇవి కూడా చదవండి

తన ధర్మాన్ని ఆచరించే స్త్రీ: ఏ వ్యక్తి జీవితంలోనైనా ధర్మాన్ని ఆచరించే స్వభావం ఉన్న మహిళ ఉంటే, అతని విధి మారుతుంది. సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలు ప్రతిరోజూ పూజలు చేస్తారు. స్త్రీలు ప్రతిరోజూ పూజించే ఇళ్లలో దేవుడు కొలువై ఉంటాడు. అటువంటి స్త్రీలు మనిషి జీవితంలోని ప్రతి సమస్య తొలగిపోతుంది. ఈ కారణంగానే అలాంటి స్త్రీలకు ఏ పరుషుడైనా తల వంచుతాడని చాణక్యుడు తెలిపాడు.

ప్రశాంతంగా ఉండే స్త్రీ: కోపం మనిషికి శత్రువు, కనుక ప్రశాంతంగా ఉండే మహిళ.. ఇంటిని అన్ని విధాలా సంరక్షిస్తుంది. శాంతి ఉన్న ఇళ్లలో దేవుడు ఉండడంతో పాటు పెద్ద అడ్డంకులు ఏర్పడవు కూడా. ఇలాంటివారికే పురుషులు తలవంచుతారంట.

పెద్దలను గౌరవించే స్త్రీ: ఇంటి పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం తెలిసిన స్త్రీని వివాహం చేసుకోవడం అనేది పురుషుడికి దక్కిన అదృష్టంగా పేర్కొన్నాడు చాణక్యుడు. ఇలాంటి మహిళ వల్ల ఇంట్లో ఆనందాలు తాండవిస్తాయి. ఇంకా ఎలాంటి సమస్యనైనా ఈ లక్షణం ఉన్న స్త్రీ పరిష్కరించగలదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..