Health Tips: మీ ఆహారంలో ఇదొక్కటి ఉంటే చాలు.. ఇట్టే బరువు తగ్గిపోవచ్చు.. అదనంగా ఎన్నో ప్రయోజనాలు కూడా..
సహజత్వానికి విరుద్ధంగా మారిన జీవినశైలి, ఆహారపు అలవాట్లతో అనేక మంది పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యల్లో అధికబరువు, ఊభకాయం కూడా ప్రముఖమైనవి. అయితే అధిక బరువు కారణంగా శరీర రోగనిరోధక శక్తి బలహీనపడడంతో...
సహజత్వానికి విరుద్ధంగా మారిన జీవినశైలి, ఆహారపు అలవాట్లతో అనేక మంది పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యల్లో అధికబరువు, ఊభకాయం కూడా ప్రముఖమైనవి. అయితే అధిక బరువు కారణంగా శరీర రోగనిరోధక శక్తి బలహీనపడడంతో పాటు, అది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. ఈ కారణంగానే అనేక మంది బరువు తగ్గడం కోసం నానా పాట్లు పడుతుంటారు. కానీ చేయవలసిన పనులు, తినవలసిన ఆహారం మాత్రం తీసుకోరు. అవును, కొన్ని రకాల ఆహారాలను నిత్యం తినడం వల్ల తేలికగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిస్తా వంటి డ్రైనట్స్ తింటే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో పిస్తా పప్పుల ద్వారా బరువు తగ్గడంతో పాటు ఏయే ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువుకు చెక్: అధిక బరువు ఉన్నవారికి పిస్తా పప్పులు మెరుగ్గా ఉపయోగపడతాయి. పిస్తా వల్ల అవాంఛిత ఆకలి నియంత్రణలో ఉండడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా మలబద్ధకం, అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి.
మెదడు పనితీరు:మెదడు పనితీరు మెరుగుపరచడం కూడా పిస్తా పప్పులు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే న్యూరోప్రొటెక్టివ్ యాక్టివిటీ లక్షణాలు మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా మీ మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం: పిస్తా పప్పులతో గుండెకు కూడా రక్షణ కలిగిస్తుంది. పిస్తాలోని కార్డియోప్రొటెక్టివ్ యాక్టివిటీ లక్షణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి గుండెపోటు, అధిక రక్తపోటు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది.
ప్రశాంతమైన నిద్ర: పిస్తా పప్పులను రాత్రిపూట పాలల్లో కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. ఇలా తాగడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. పిస్తాలోని యాంటీఆక్సిడెంట్ కెరోటినాయిడ్స్, పాలీ, మోనో-అసంతృప్త కొవ్వు ఆమ్లాలు లుటిన్, ఆల్ఫా, బీటా కెరోటిన్ మీ మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.
కంటి రక్షణ: పిస్తా పప్పు రోజూ తినడం వల్ల సూర్యుని అతినీలలోహిత కిరణాలు నుంచి కళ్లను రక్షిస్తాయి.