- Telugu News Photo Gallery Add these Dry fruits and food items to get rid of Hair fall, dandruff and many other Hair problems,
Healthy Hair: కేశ సమస్యలకు చెక్ పెట్టే ఆహారాలివే.. వారంలో ఒక్క సారి తీసుకున్నా మృధువైన నల్లని జుట్టు మీ సొంతం..
ఈ మధ్యకాలంలో జుట్టురాలడం, చుండ్రు వంటి పలు రకాల జుట్టు సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక ఈ సమస్యల నుంచి బయటపడేందుకు నేటి యువత నానా రకాల షాంపూలు, ట్రీట్‌మెంట్స్ తీసుకుంటున్నారు. అయితే అవేమి అవసరం లేకుండా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు. వారి సూచనల ప్రకారం కొన్ని రకాల ఆహారాలను, విత్తనాలను తీసుకుంటే చాలు. జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అంది, సమస్యలు దూరమవుతాయి. మరి జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకోవలసిన ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 26, 2023 | 9:13 AM

గుమ్మడికాయ గింజలు : గుమ్మడి గింజల్లో అధిక మొత్తంలో ఉండే జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియం, కాల్షియం వంటి మినరల్స్ జుట్టు రాలే సమస్యను తగ్గించి, వెంట్రుకలు బలంగా ఎదిగేలా చేస్తాయి.

జనపనార విత్తనాలు : ఒమేగా-3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్‌కు జనపనార విత్తనాలు పవర్ హౌస్ లాంటివి. వీటిని అప్పుడప్పుడు తిన్నా కూడా తలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గడంతో పాటు కుదుళ్లు బలంగా మారతాయి.

పిస్తా : పిస్తాలో ఉండే బయోటిన్ జుట్టు ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్‌లా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉండడంతో ఇది జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. తద్వారా హెయిర్‌ఫాల్ సమస్య తగ్గుతుంది.

అవిసె గింజలు : ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నన్స్ పుష్కలంగా ఉన్న అవిసె గింజలను మీ డైట్‌లో చేర్చుకోవడం కూడా మంచిది. ఇది తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ ఫోలికల్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. తద్వారా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.

కొబ్బరి : కొబ్బరిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వారానికి రెండు సార్లు తిన్నా కూడా జుట్టు కుదుళ్ల పోషణ పెరుగుతుంది. ఫలితంగా జుట్టు డీప్ కండీషన్ అవ్వడంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది.

బాదం పప్పు: బాదం పప్పులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టగలదు. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం.

వాల్‌నట్స్:వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటి కారణంగా మీ జట్టు కుదుళ్లు కూడా బలంగా మారి హెయిర్ ఫాల్ సమస్య నుంచి ఉపశమనం కల్సిస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు: కేశసమస్యలకు చెక్ పెట్టడంలో పొద్దుతిరుగుడు విత్తనాలు మెరుగ్గా పనిచేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే గామా-లినోలెనిక్ అనే యాసిడ్ జుట్టురాలే సమస్య నుంచి త్వరగా ఉపశమనం కల్పిస్తుంది. అంతేకాకుండా కుదుళ్లను బలంగా తయారుచేసి, లోపలి నుంచి జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.





























