AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger: ఆరోగ్యం.. అమృతం.. విషం.. ఆవేశపడి అల్లం ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..?

మన భారతదేశంలో అల్లం ఉపయోగించని గృహం ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతీ వంటకాల్లో అల్లం ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే, అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్లం అధిక వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Apr 26, 2023 | 10:58 AM

Share
అల్లంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అల్లం తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అదే కాదు.. దగ్గు, జలుబు, ఇతర శారీరక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందటారు. '

1 / 8
మన భారతదేశంలో అల్లం ఉపయోగించని గృహం ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతీ వంటకాల్లో అల్లం ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే, అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 8
అల్లం ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, విరేచనాలు, గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రోజులో నాలుగు గ్రాముల కంటే ఎక్కువ అల్లం తినకూడదని సూచిస్తున్నారు. అల్లం అధిక వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

3 / 8
గుండె సంబంధిత సమస్యలు: అల్లం అధిక వినియోగం వల్ల గుండె దడ కలుగుతుంది. అల్లం అధిక వినియోగం వలన అస్పష్టమైన కంటి చూపు, నిద్రలేమి, తక్కువ రక్తపోటు సమస్యలకు కారణమవుతుంది.

4 / 8
గర్భస్త్రావం: గర్భిణీ స్త్రీలు ప్రారంభ సమయంలో అల్లం వినియోగానికి దూరంగా ఉండాలి. అధికంగా అల్లాన్ని వినియోగించడం వలన.. గర్భస్త్రావం జరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు.. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం అవుతుంది. అందుకని.. అల్లం కు దూరంగా ఉండటం ఉత్తమం.

5 / 8
డయాబెటిక్ రోగులకు హానికరం: అల్లం అధికంగా తీసుకోవడం మధుమేహ రోగులకు హానికరం. ఇది శరీరంలో రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. ఇది మైకం, అలసటను కలిగిస్తుంది. మధుమేహ బాధితులు అల్లం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.

6 / 8
కడుపు నొప్పి: అధిక అల్లం వినియోగం కడుపు నొప్పికి కారణం అవుతుంది. కడుపు ఖాళీగా ఉంటే ఇది అధిక గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతుంది. ఫలితంగా జీర్ణశాయంలో చికాకు, కడుపు నొప్పికి దారితీయవచ్చు. అల్లంలోని క్రియాశీల పదార్ధం ఉదర సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది.

7 / 8
చర్మం, కంటి అలెర్జీ సమస్యలు: కొన్ని సందర్భాల్లో అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీకి కారణం కావచ్చు. చర్మంపై దద్దుర్లు, అలాగే కళ్ళు ఎర్రబడటం, శ్వాసలోపం, దురద, పెదవులు వాపు, కళ్లల్లో దురద, గొంతు అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి.

8 / 8