AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: యాటీట్యూడ్ బోల్తే..! ఉడుతతో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇంటర్వ్యూ.. దాని స్పందన ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ఫోటోగ్రఫీ అంటే సాధారణమైన విషయం కానే కాదు. అందులోనూ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చుక్కలే. ఎంతో నిరీక్షణగా ఓర్పుతో ఉంటేనే అందమైన దృశ్యాలను కెమెరాలలో బంధించడం సాధ్యమవుతుంది. మనం నిత్యం సోషల్ మీడియాలో..

Watch Video: యాటీట్యూడ్ బోల్తే..! ఉడుతతో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇంటర్వ్యూ.. దాని స్పందన ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Chipmunk's Interview
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 26, 2023 | 10:46 AM

Share

ఫోటోగ్రఫీ అంటే సాధారణమైన విషయం కానే కాదు. అందులోనూ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చుక్కలే. ఎంతో నిరీక్షణగా ఓర్పుతో ఉంటేనే అందమైన దృశ్యాలను కెమెరాలలో బంధించడం సాధ్యమవుతుంది. మనం నిత్యం సోషల్ మీడియాలో చూసే అడవి జంతువుల వీడియోలు, ఫోటోల వెనుక కూడా వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ల ఓర్పుసహనాలతో కూడిన శ్రమ ఎంతగానో ఉంటుంది. అయితే తాజాగా ఓ ఉడుతను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లి సెకన్ల కొద్ది సమయం సహనంగా గడిపిన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌‌కి చెందిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉడుత చేసిన పనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అసలు ఆ వీడియోలో ఏం జరిగిదంటే.. ఉడుతను ఇంటర్వూ చేయడానికి దాని దగ్గరకు వెళ్లాడు ‘జూలియన్ రాడ్’ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. అయితే ఆ ఉడుత ఇంటర్వ్యూ ఇవ్వకుండా తనకేం పట్టనట్లు యాటిట్యూడ్ చూపించింది. అతని వైపు కనీసం చూడకుండా గడ్డిపూలను తింటూ సమయం గడిపింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు జూలియన్. వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే అది నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

జూలియన్ షేర్ చేసిన ‘ఉడుత ఇంటర్వ్యూ’ వీడియోను చూసిన నెటిజన్లు వీడియో తెగ నచ్చేసిందంటూ స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఈ ఫోటోగ్రాఫర్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం కంటే నాకు తినడమే ముఖ్యమని ఉడుత అనుకోంటోంది’ అంటూ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ అయితే ‘నేను మాట్లాడను. నా యాటీడ్యూడ్ బోల్తే’ అంటూ ఉడుత భావిస్తుండవచ్చని కామెంట్ చేశాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 9 లక్షల 67 వేల వైకులు, 84 లక్షలకు పైగా వీక్షణలు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..