AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పులులకు పాలిచ్చి, తల్లిగా మారిన కుక్క.. నమ్మలేకపోతున్న నెటిజన్లు..

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పులి పిల్లలకు పాలిచ్చి, వాటి అలనాపాలనా చూసుకుంటూ పెద్ద చేసిన కుక్క సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సాధారణంగా ఏ జంతువైనా పులిని చూస్తే.. చూసిన పరిసరాలలో కనిపించకుండా..

Watch Video: పులులకు పాలిచ్చి, తల్లిగా మారిన కుక్క.. నమ్మలేకపోతున్న నెటిజన్లు..
Dog Feeding Tiger Cubs
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 25, 2023 | 2:09 PM

Share

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పులి పిల్లలకు పాలిచ్చి, వాటి అలనాపాలనా చూసుకుంటూ పెద్ద చేసిన కుక్క సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సాధారణంగా ఏ జంతువైనా పులిని చూస్తే.. చూసిన పరిసరాలలో కనిపించకుండా పరుగులు తీస్తుంది. కానీ వీడియోలోని కుక్క మాత్రం వాటికి పాలివ్వడంతో పాటు, వాటి సంరక్షణా బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ఇలా అరుదైన సదృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడంతో పాటు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అసలు ఆ వీడియలో ఏముందంటే..

ఒక కుక్క నాలుగు పులి పిల్లలకు పాలిస్తుంది. అవి అలాగే పెద్దయ్యే దాకా వాటి పోషణను నిర్వహిస్తుంది. ఆ క్రూర మృగాలు పెద్దయిన తర్వాత కూడా తమకు తల్లిగా బాధ్యతలు నిర్వహించిన ఆ కుక్కను ఏమి చేయకుండా ఉండడం ఆశ్చర్యకరమైన దృశ్యం. ఇంకా ఒక సమయంలో రెండు పులులు కొట్టుకుంటుంటే ఆ తల్లి కుక్క వాటిని వారించేందుకు ఒక పులిపై పడి ఆపుతుంది. ఇలా సాగిన ఈ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘నిజంగా నమ్మలేకపోతున్నా.. ఆ క్రూర మృగాలు పెద్దయిన తర్వాత కూడా తమను పోషించిన తల్లిని మరిచిపోలేదు. చాలా అద్బుతమైన వీడియో’ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే ‘ఇప్పటికి అవి బాగానే ఉన్నా ఏదో ఓ రోజు ఆ అమాయకపు కుక్కను అవి చంపుకు తింటాయి’ అని తనలోని భయాన్ని వ్యక్తం చేశారు. ‘చూశారుగా.. కుక్కలను పెంచుకోవడానికి ఇది కూడా ఒక కారణం’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇలా పలువురు నెటిజన్లు వీడియోపై స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వీడియోకు ఇప్పటివరకు 8 లక్షల 63 వేల వీక్షణలు, 72 వేలకు పైగా లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..