Apple iPhone 14: ఐఫోన్‌ ప్రియులకు అదిరిపోయే అవకాశం..! కేవలం రూ. 3,000కే ఐఫోన్‌ 14 మీ సొంతం..!!

ఇక్కడ చాలా మంది వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తారు. విక్రయిస్తారు. ఇక్కడ కొనుగోలు చేసిన వస్తువులు కూడా మన్నికగానే ఉంటాయి.. అయితే కేవలం రూ.3 వేలకే ఐఫోన్ 14 ఆఫర్ చేయడం కొందరిలో అనుమానాలకు తావిస్తోంది. మీరు కూడా ఈ ఆఫర్‌ని చూసినట్లయితే, పూర్తి వివరాలను చెక్‌ చేసుకోండి.

Apple iPhone 14: ఐఫోన్‌ ప్రియులకు అదిరిపోయే అవకాశం..! కేవలం రూ. 3,000కే ఐఫోన్‌ 14 మీ సొంతం..!!
Apple Iphone 14
Follow us

|

Updated on: Apr 25, 2023 | 4:02 PM

స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ అగ్రస్థానంలో ఉంది. ఇది చాలా ప్రీమియం, గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. యాపిల్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఐఫోన్ లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే గ‌త ఏడాది లాంఛ్ అయిన ఐఫోన్ 14 భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అయిన ఐఫోన్ 14 మోడల్స్ కి మంచి క్రేజ్ దక్కింది. అయితే, ఇప్పుడు ఎన్న‌డూ లేనంత‌గా ఆన్‌లైన్‌ మార్కెట్లో అతి త‌క్కువ ధ‌ర‌కు ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. కొత్త ఐఫోన్ వచ్చిన వెంటనే, పాత మోడల్ ధర తగ్గుతుంది. ఐఫోన్ 15 మార్కెట్ ఎంట్రీకి ముందే, ఐఫోన్ 14 ధర గణనీయంగా తగ్గింది. ధర నమ్మలేనంత తక్కువకు పడిపోయింది.. మీరు ఇప్పుడు ఐఫోన్ 14ని కేవలం రూ.3 వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇంత తక్కువ ధరకు ఫోన్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండి.

ఐఫోన్ 14పై భారీ తగ్గింపు! ఐఫోన్ 14 ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో కేవలం రూ. 3,000కు అమ్మకానికి అందుబాటులో ఉంది.. ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒకింత నమ్మశక్యంగా లేదంటూ షాక్ అవుతున్నారు. అయితే, ప్రశాంత్ బదానా ఈ పోస్ట్‌ను ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో షేర్‌ చేశారు. ఫరీదాబాద్‌లో ఐఫోన్ 14 అందుబాటులో ఉందని ఆయన ట్విట్‌ ద్వారా పేర్కొన్నారు.

Facebook Marketplace చాలా ప్రజాదరణ పొందింది. ఇక్కడ చాలా మంది వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తారు. విక్రయిస్తారు. ఇక్కడ కొనుగోలు చేసిన వస్తువులు కూడా మన్నికగానే ఉంటాయి.. అయితే కేవలం రూ.3 వేలకే ఐఫోన్ 14 ఆఫర్ చేయడం కొందరిలో అనుమానాలకు తావిస్తోంది. మీరు కూడా ఈ ఆఫర్‌ని చూసినట్లయితే, పూర్తి వివరాలను చెక్‌ చేసుకోండి. అసలైనదిగా అనిపిస్తేనే కొనండి. ముందస్తు చెల్లింపుకు బదులుగా COD ఎంపికను ఎంచుకోండి. ఈ ఆప్షన్ ఇవ్వకపోతే అక్కడి నుంచి ఎలాంటి వస్తువులు కొనకండి. పలు సందర్భాల్లో ఇలాంటి ప్రకటనలు మోసపూరితంగా ఉంటాయి. తస్మాత్‌ జాగ్రత్త..!

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..