మన క్రికెటర్స్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూశారా ?.. ధోనీ నుంచి విరాట్ వరకు ఎంత క్యూట్‏గా ఉన్నారో.. ఫోటోస్ వైరల్..

అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఎవరూ ఊహించని రీతిలో క్రియేటర్స్ వారి ఊహలకు జీవం పోస్తున్నారు. ఇప్పుడు మన అభిమాన భారతీయ క్రికెటర్లలో కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించిన చిత్రాలతో వారు పసిపిల్లలుగా మారిపోయారు. అయితే ఇక్కడ తమాషా ఏమిటంటే వారిలో కొందరు అప్పటికే గడ్డాలు, మీసాలతో ఉన్నారు. ఈ ఫోటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

మన క్రికెటర్స్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూశారా ?.. ధోనీ నుంచి విరాట్ వరకు ఎంత క్యూట్‏గా ఉన్నారో.. ఫోటోస్ వైరల్..
A1 Generated Photos
Follow us

|

Updated on: Apr 24, 2023 | 9:34 PM

ప్రపంచ సెలబ్రిటీలు, బిలియనీర్లు, రాజకీయ నాయకులు, కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలకు సంబంధించి గతంలో ఎన్నడూ చూడని రూపాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాంటి వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు..ప్రస్తుత కళలు, సృజనాత్మకత రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ ఛేంజర్‌గా మారింది. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఎవరూ ఊహించని రీతిలో క్రియేటర్స్ వారి ఊహలకు జీవం పోస్తున్నారు. ఇప్పుడు మన అభిమాన భారతీయ క్రికెటర్లలో కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించిన చిత్రాలతో వారు పసిపిల్లలుగా మారిపోయారు.

అత్యంత స్టైలిష్ క్రికెటర్లలో ఒకరితో ప్రారంభించి వైరల్ థ్రెడ్‌లో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్‌ తదితరులు బాల్యం ఎలా ఉండేవారో చూసి ప్రజలు ముచ్చటపడుతున్నారు. అయితే తమాషా ఏమిటంటే వారిలో కొందరు అప్పటికే గడ్డాలు, మీసాలతో ఉన్నారు. ఈ ఫోటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్ యూజర్ గౌరవ్ అగర్వాల్ తన ట్విట్టర్ అకౌంట్‏లో ఈ ఫోటోలోను పోస్ట్ చేశాడు. ఇండియన్ క్రికెటర్స్ టోడ్లర్ AI జెనరేటెడ్ అని క్యాప్షన్ ఇచ్చాడు.  కృత్రిమ మేధస్సును ఉపయోగించి భారతీయ క్రికెటర్లను బాలురుగా రీక్రియేట్ చేశాడు. ఈ ఫోటోలలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, ఇతర భారత క్రికెటర్లు ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్  కోసం..

Latest Articles