AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Kaveri: సూడాన్ నుండి తరలింపు.. భారతీయుల కోసం ‘ఆపరేషన్ కావేరీ’ ప్రారంభించిన కేంద్రం

సూడాన్‌ ఆర్మీకీ, సూడాన్‌ పారా మిలిటరీ దళాలకీ మధ్య జరిగిన ఘర్షణలు హింసకు దారితీశాయి. సూడాన్‌ క్యాపిటల్‌ ఖార్తోమ్‌లో అంతర్యుద్ధ పరిస్థితులు అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. బాంబుల మోతతో ఖార్తోమ్‌ దద్దరిల్లుతోంది. దేశంలో హింస చెలరేగింది. విద్యుత్‌ లేక, కనీసం మంచినీళ్ళు ఆహారం దొరక్క అనేక మంది

Operation Kaveri: సూడాన్ నుండి తరలింపు.. భారతీయుల కోసం ‘ఆపరేషన్ కావేరీ’ ప్రారంభించిన కేంద్రం
Operation Kaveri
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2023 | 8:43 PM

Share

సూడాన్‌ అంతర్గత ఆధిపత్యపోరుతో సూడాన్‌లో చెలరేగిన హింస సూడాన్‌లోని భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. సూడాన్‌లో చిక్కుకుపోయిన వందలాది మందిని సురక్షితంగా భారత్‌కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి ఆపరేషన్‌ కావేరి అని పేరుపెట్టింది. సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కిరప్పించేందుకు “ఆపరేషన్‌ కావేరి” పేరుతో రక్షణ చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. 500 మందిని తీసుకొచ్చేందుకు భారత నౌకలు, విమానాలను సిద్ధం చేసినట్టు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.

సూడాన్‌లో చిక్కుకుపోయిన 500 మంది భారతీయులు సూడాన్‌ పోర్ట్‌కి చేరుకున్నట్టు భారత విదేశాంగా శాఖా మంత్రి జైశంకర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేశారు. ఆపరేషన్‌ కావేరి ద్వారా సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి భారత్‌కి రప్పించే ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. 500 మంది పోర్ట్‌ సూడాన్‌కి చేరుకున్నారనీ, మరికొంత మంది మార్గంమధ్యలో ఉన్నారని వెల్లడించారు మంత్రి జైశంకర్‌. వారిని తిరిగి సురక్షితంగా భారత్‌కి చేర్చేందుకు ఇండియన్‌ షిప్స్‌, విమానాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. మనదేశానికి చెందిన నౌకలను, రెండు C-130J విమానాలను భారత్‌ అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

సూడాన్‌ ఆర్మీకీ, సూడాన్‌ పారా మిలిటరీ దళాలకీ మధ్య జరిగిన ఘర్షణలు హింసకు దారితీశాయి. సూడాన్‌ క్యాపిటల్‌ ఖార్తోమ్‌లో అంతర్యుద్ధ పరిస్థితులు అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. బాంబుల మోతతో ఖార్తోమ్‌ దద్దరిల్లుతోంది. దేశంలో హింస చెలరేగింది. విద్యుత్‌ లేక, కనీసం మంచినీళ్ళు ఆహారం దొరక్క అనేక మంది భారతీయులు సూడాన్‌లో నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్‌ కావేరి పేరుతో భారతీయులను వెనక్కిరప్పించేందుకు సింసిద్ధమైంది. సూడాన్‌లో కనీసం 420 మంది పౌరులు మరణించారనీ, 3,700 మంది తీవ్రంగా గాయపడ్డట్టు సూడాన్‌ హెల్త్‌మినిస్ట్రీ వ్యాఖ్యలను వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ WHO రీట్వీట్‌ చేసింది.

మరోవైపు సూడాన్ యుద్ధభూమిలో చిక్కుకున్న విదేశీయులను తరలిస్తోంది ఫ్రాన్స్‌ ప్రభుత్వం. తమ దేశస్తులతో పాటు 27 ఇతర దేశాల వారిని సైతం తరలించింది ఫ్రాన్స్. వీరిలో భారతీయులు కూడా ఉన్నట్టు ఫ్రెంచ్ ఎంబసీ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..