చెన్నై ఐఐటీలో చదివాడు.. దుబాయ్‌లో భారీ జీతంతో ఉద్యోగం.. కట్‌చేస్తే.. ప్రియురాలి కోసం ఊచలు లెక్కిస్తున్నాడు..!
తాను దుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ అమ్మాయి నైట్‌క్లబ్‌లో డ్యాన్స్ చేయడానికి వచ్చిందని, ఆమెతో ప్రేమలో పడ్డానని హేమంత్ కుమార్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా నైట్‌క్లబ్ డ్యాన్సర్ ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చిందని చెప్పాడు. దీంతో వీరిద్దరూ గతేడాది..
ప్రేమ కోసం ఏమైనా చేసేందుకు సిద్దపడేవాళ్లు ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. వారు తమ ప్రియమైనవారి కోసం ఎంతటి సహాసమైన, ఎలాంటి పిచ్చి పనైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రేమించిన ప్రియురాలి కోసం 40 ఏళ్ల హేమంత్ కుమార్ రఘు అనే వ్యక్తి ఎవరూ చేయని పని చేశాడు.. దుబాయ్‌లో మంచి జీతంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ప్రేమ కోసం అతడు చేసిన పని కారణంగా.. అతనితో పాటు అతని ముగ్గురు స్నేహితులను కటకటాల పాలుజేశాడు..ఈ విచిత్ర సంఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. హేమంత్ కుమార్ రఘు ఓ మహిళ నుంచి రూ.2.2 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నలుగురి నుంచి నగదు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, చోరీకి గురైన 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతకు సదరు ప్రేమికుడు ఏం చేశాడు.. అతనితో పాటు తన స్నేహితులు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హేమంత్ కుమార్ రఘు. చెన్నైలోని ఐఐటీలో చదివి దుబాయ్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నైట్‌క్లబ్‌లో డ్యాన్సర్‌గా ఉన్న తన ప్రియురాలి కోసం ఉద్యోగాన్ని వదిలేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ అమ్మాయి నైట్‌క్లబ్‌లో డ్యాన్స్ చేయడానికి వచ్చిందని, ఆమెతో ప్రేమలో పడ్డానని హేమంత్ కుమార్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా నైట్‌క్లబ్ డ్యాన్సర్ ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చిందని చెప్పాడు. దీంతో వీరిద్దరూ గతేడాది బీహార్ చేరుకున్నారు. హేమంత్ తన స్నేహితురాలిని సంతోషపెట్టడానికి 15 ఏళ్లుగా పొదుపు చేసిన డబ్బునంతా నీళ్లలా ఖర్చు చేశాడు.
ఒక దశలో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇక ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆలోచిస్తే హేమంత్‌కు ఒక చెత్త ఐడియా తట్టింది. ఉద్యోగం చేసినా, కూలికి వెళ్లి నెల నెలా సంపాదించుకునే బదులు, అదే మొత్తం ఒకేసారి సంపాదిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు హేమంత్. ఆ తర్వాత బతకడం కోసం దొంగతనాలు సహా నేరాలకు పాల్పడుతున్నానని పోలీసులకు తెలిపాడు. సాధారణ నేరగాళ్లతో నెట్‌వర్క్‌గా ఏర్పడి పక్కా ప్రణాళికతో చోరీలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..