AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చిరుతపులిని ఉక్కిరిబిక్కిరి చేసిన రాక్షస బల్లి.. చెంప చెల్లుమనిపించింది..! వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మనల్ని బాధపెడతాయి..అలాంటి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో, అడవిలో అత్యంత భయంకరమైన జంతువులలో ఒకటైన చిరుతపులిని ఒక చిన్న జంతువు చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. ట్విట్టర్ యూజర్ ది ఫిగెన్ వీడియోను షేర్ చేశారు. కాగా, వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

Watch: చిరుతపులిని ఉక్కిరిబిక్కిరి చేసిన రాక్షస బల్లి.. చెంప చెల్లుమనిపించింది..! వైరల్ అవుతున్న వీడియో
Giant Lizard
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2023 | 8:08 PM

Share

ప్రస్తుతం ప్రపంచమంతా ఇంటర్‌నెట్‌పైనే ఆధారపడి నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా లేకుండా ఉండలేని వాతావరణంలో మనం జీవిస్తున్నాం..చాలా మందికి సోషల్ మీడియా పేజీలు పని చేయనప్పుడు వీడియోలు చూడటం అలవాటు..అందుకే మనం సోషల్ మీడియా ప్రపంచంలో చాలా విషయాలు చూస్తుంటాం. మనం ఊహించలేని అనేక సంఘటనలు, వింతలు ఇక్కడ కనిపిస్తుంటాయి..జంతువుల వీడియోలు, పిల్లల కొంటె వీడియోలు ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.. మనం చూసే వీడియోలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి, ఒక్కోసారి ఆలోచింపజేస్తాయి.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని వీడియోలు మనల్ని బాధపెడతాయి..అలాంటి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో, అడవిలో అత్యంత భయంకరమైన జంతువులలో ఒకటైన చిరుతపులిని ఒక చిన్న జంతువు చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. ట్విట్టర్ యూజర్ ది ఫిగెన్ వీడియోను షేర్ చేశారు. కాగా, వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

వీడియోలో, ఒక చిరుతపులి ఎరకోసం చూస్తుండగా, ఒక చిన్ని జీవి ఒకటి దూరంగా కనిపించింది. వెంటనే దానిని వేటాడేందుకు దాన్ని సమీపిస్తుంది. అయితే, అక్కడ చిరుతకు కనిపించింది ఒక అరుదైన బల్లి. ఇది చూసేందుకు రాక్షస బల్లిని పోలి ఉంది. భోజనం దొరికింది కదా అనుకున్న చిరుత ఆ బల్లిని పంజాతో పట్టేందుకు ప్రయత్నించింది. కానీ, బల్లి చిరుతకు చుక్కలు చూపించింది.

ఇవి కూడా చదవండి

తనను పట్టుకునేందుకు చూసిన చిరుతపులిని బల్లి భయపెట్టింది. తన తోకను ఊపుతూ పాంథర్‌ను కొట్టింది. దీంతో ఒక్క నిమిషం పాటు చిరుత చలించిపోయిన దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన చాలా మంది షాక్ అవుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు 9,000కు పైగా లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..