వేసవిలో కలిగే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా సరే.. ఈ పండు దివ్యౌషధం..! తక్షణ ఉపశమనం లభిస్తుంది..?
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనిని తింటే, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది మనల్ని వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎండ వేడిమి రోజురోజుకూ పెరుగుతోంది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సీజనల్‌గా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం చాలా అవసరం. వేసవిలో ఎక్కువగా మామిడి పండ్లు, పుచ్చకాయ ఎక్కువగా కనిపిస్తాయి. పుచ్చకాయ శరీరానికి ఎక్కువ నీటిని అందించడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. వేసవిలో లభించే మరో పండు తాటి ముంజలు. ఇది దక్షిణ భారతదేశంలో కనిపించే ప్రసిద్ధ పండు. దీనిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఈ వేసవిలో ఎక్కడ చూసినా తాటి ముంజలు విరివిగా అమ్మడం చూస్తుంటాం. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి, శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, ఐరన్, జింక్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తక్కువ కేలరీలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు సి, ఎ, ఇ మరియు కె కూడా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఐరన్, పొటాషియం, జింక్ మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇకపోతే, తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలించినట్టయితే…
మధుమేహం సమస్యను దూరం చేస్తుంది:
వేసవిలో డీహైడ్రేషన్ సర్వసాధారణం. శరీరంలో డీహైడ్రేషన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో అల్ఫాహారంగా కూడా తినడం మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. హైడ్రేట్ చేస్తుంది. ఇది సహజంగా డీహైడ్రేషన్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బరువు తగ్గటానికి:
వేసవిలో ముంజలు తింటే బరువు సులభంగా తగ్గుతారు. ముంజల్లో క్యాలరీలు తక్కువగానూ, నీటిశాతం ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఈ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీవక్రియను కూడా సక్రమంగా నిర్వహించేలా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించే వారు వేసవిలో ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనిని తింటే, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది మనల్ని వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్యకరమైన చర్మం కోసం:
వేసవిలో తాటి ముంజలు తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది అనేక రకాల వేసవి చర్మ సమస్యలను సులభంగా నయం చేస్తుంది. ఈ పండు చెమట పట్టడం, చర్మం ఎర్రబడడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..