బాబోయ్‌ ఎండలు..! పార్కింగ్‌లో కరిగిపోతున్న కార్లు..! షాకింగ్‌ ఫోటోలు వైరల్‌

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనుషులనే కాదు జంతువులు, పక్షులపై కూడా తల్లడిల్లిపోతున్నాయి. భగభగ మండే ఎండల కారణంగా వాహనాలు కూడా కాలిపోతున్నాయి. ఎండవేడిమి కారణంగా ఒక కారు కరిగిపోయిన దృశ్యం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

బాబోయ్‌ ఎండలు..!  పార్కింగ్‌లో కరిగిపోతున్న కార్లు..! షాకింగ్‌ ఫోటోలు వైరల్‌
Summer
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 24, 2023 | 2:51 PM

దేశమంతటా వేసవి ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు వేసవి తాపంతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. ఎండల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, వికలాంగులు అధిక వేడి, ఉక్కపోతతో అవస్థపడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనుషులనే కాదు జంతువులు, పక్షులపై కూడా తల్లడిల్లిపోతున్నాయి. భగభగ మండే ఎండల కారణంగా వాహనాలు కూడా కాలిపోతున్నాయి. ఎండవేడిమి కారణంగా ఒక కారు కరిగిపోయిన దృశ్యం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. SUV వాహనాల్లో ఒకటి టాటా హారియర్ కార్‌ ముందు భాగం తీవ్రమైన వేడి కారణంగా కరిగిపోవడం ప్రారంభించింది. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

Heat Wave ఈ విషయాన్ని సౌరవ్ నహదా అనే కారు యజమాని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అతని పోస్ట్‌లో 2021 నుండి తాను టాటా హారియర్ కారును ఉపయోగిస్తున్నట్టుగా చెప్పాడు. కారుకు సంబంధించిన సమాచారం అంతా ఆన్‌లైన్‌లో చూసి ఈ కారును కొనుగోలు చేసినట్టుగా చెప్పాడు. అదే కారులో ఆఫీస్‌కి వెళ్తున్న సౌరవ్‌..బెంగళూరులోని నా కార్యాలయం బయట 10 గంటల పాటు పార్క్ చేశానని ఆ తర్వాత కారు తీయడానికి వచ్చి చూసేసరికి హారియర్ ముందు భాగం ఎండకు కాలిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయానంటూ చెప్పాడు. కారు ఫ్రంట్ గ్రిల్, బంపర్ కరిగిపోతున్నట్లు కనిపించే ఫోటోలను కూడా అతడు తన ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

టాటాను ట్యాగ్ చేస్తూ ఏప్రిల్ 12న బెంగళూరు ఎండలో 10 గంటల పాటు తన కారును పార్క్ చేస్తే ఏం జరిగిందో తన ట్విట్‌ ద్వారా వివరించాడు. ఇప్పుడు జరిగిన నష్టాన్ని చెల్లించాలని కంపెనీని డిమాండ్‌ చేశాడు. టాటా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోందంటూ పోస్ట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..