Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలోనూ గంగా పుష్కరాలు ప్రారంభం.. పుణ్యస్నానాలు ఆచరించిన సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు..

ఈ ప్రాంతానికి పురాణాలతో సంబంధం ఉంది. ఈ ప్రాంతంలో గరుడ గంగా ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ మూడు అడుగుల గొయ్యి తవ్వితే విభూది లభిస్తుందని అంటారు.

తెలంగాణలోనూ గంగా పుష్కరాలు ప్రారంభం.. పుణ్యస్నానాలు ఆచరించిన సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు..
Garuda Ganga Pushkaram
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 22, 2023 | 1:10 PM

పుష్కర కాలానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగ ప్రారంభమైంది.12 సంవత్సరాలకొకసారి నిర్వహించే గంగా పుష్కరాల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు (మేష రాశిలో గురు సంక్రమణం) గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. గంగానది ప్రవహించే ప్రతిచోటా ఈ పుష్కరాలు జరుగుతాయి. అయితే, గంగోత్రి, రుషికేశ్‌, హరిద్వార్‌, వారణాసి, ప్రయాగరాజ్‌లో గంగా పుష్కరాలు అట్టహాసంగా సాగుతాయి. అయితే, ఇక్కడ మన తెలంగాణలోనూ గంగాపుష్కరాలు జరిగే పవిత ప్రదేశం ఒకటి ఉంది. అది మెదక్‌ జిల్లాలో.. మెదక్‌ సమీపంలోని పేరూరులో మంజీరా నదిలో గరుడ గంగ పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

మంజీరా నదికి పూజలు చేసి పుష్కర వేడుకలను రంగంపేట పీఠాధిపతి మాధవనందా స్వామీ ప్రారంభించారు. మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న గరుడ గంగా మంజీరా నదిలో స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సరస్వతి మాత సన్నిధికి విచ్చేసిన మాదానంద సరస్వతికి నిర్వాహకులు దోమల రాజమౌళి శర్మ గుణాకర శర్మ మహేష్ శర్మల ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం అమ్మవారికి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంజునాథ స్వామిని అభిషేకించారు. ఈ సందర్భంగా పుష్కర దేవతకు 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు.

ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. మంజీరా తీరంలో పుష్కరాలు నిర్వహించడం ఇది రెండోసారి. 2011లో తొలిసారి ఇక్కడ పుష్కరాలు నిర్వహించారు. అప్పడు కేసీఆర్‌ పుష్కరాల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు మంజీరాను గరుడ గంగా అని పిలిచేవారు. పేరూరులోని ఈ ప్రాంతానికి పురాణాలతో సంబంధం ఉంది. ఈ ప్రాంతంలో గరుడ గంగా ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ మూడు అడుగుల గొయ్యి తవ్వితే విభూది లభిస్తుందని అంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..