ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో నడిచే రైలు.. కూతకు సిద్ధం..! రైల్వే మంత్రిత్వ శాఖ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌..

రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా, గంటల వ్యవధిలోనే ప్రజల విపరీతంగా చూసేశారు..ఎత్తైన వంతెన వైరల్ గా మారింది.  ఈ వంతెన ఎత్తును అంచనా వేయడం చాలా కష్టం. ఈ వీడియో చూసే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..

ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో నడిచే రైలు.. కూతకు సిద్ధం..! రైల్వే మంత్రిత్వ శాఖ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌..
Chenab Bridge
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 22, 2023 | 12:18 PM

చీనాబ్ వంతెన: ఇప్పటి వరకు మీరు నదులు, సముద్రాల మీదుగా రైలులో ప్రయాణం చేసే ఉంటారు. కానీ, మీరు ఈ రైలులో అంత ఎత్తు నుండి ప్రయాణిస్తే.. అది నిజంగా సాహసమే అని చెప్పాలి. అలాంటి అనుభూతిని పొందాలంటే యూరప్, అమెరికా వెళ్లనవసరం లేదు. ఎందుకంటే, ఈ ప్రయాణం భారతదేశంలోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని భారతదేశంలో నిర్మిస్తున్నారని మీకు తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న చీనాబ్ రైలు వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఈ రైలులో ప్రయాణించడం ఒక విభిన్నమైన థ్రిల్లింగ్‌ అనుభూతిని కలిగిస్తుంది. చీనాబ్ రైలు వంతెన బక్కల్, కౌడి మధ్య ఉంది. తాజాగా చీనాబ్ రైలు వంతెనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా, గంటల వ్యవధిలోనే ప్రజల విపరీతంగా చూసేశారు..ఎత్తైన వంతెన వైరల్ గా మారింది.  ఈ వంతెన ఎత్తును అంచనా వేయడం చాలా కష్టం. ఈ వీడియో చూసే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..

1178 అడుగుల ఎత్తు..

ఈ వంతెన ఎత్తు గురించి చెప్పాలంటే, ఇది 1178 అడుగుల ఎత్తు. దీని నిర్మాణానికి దాదాపు 1486 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చీనాబ్ వంతెన జీవిత కాలం సుమారు 120 సంవత్సరాలు. విశేషమేమిటంటే ఈ బ్రిడ్జి ఎత్తు ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ.. అంటే దీని పొడవు 1315 మీటర్లు. రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసిన వీడియోలో 2003 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రాజెక్ట్ రూపాంతరం చెందిన దృశ్యాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు.

ఇవి కూడా చదవండి

2024లో అందుబాటులోకి..

ఈ వంతెన వచ్చే ఏడాది అంటే 2024లో ప్రయాణానికి అందుబాటులోకి రానుంది. ఈ వంతెన జమ్మూ-ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన భాగం. ఇది కాకుండా ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా సెక్షన్‌కు చీనాబ్ వంతెన చాలా ముఖ్యమైనది.

వంతెన నిర్మాణంలో అనేక సవాళ్లు..

ఈ వంతెన నిర్మాణం అత్యంత ఖర్చు, కష్టంతో కూడుకున్న పని. అంతేకాదు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది. కనెక్టివిటీ కొరత బాగా ఉంది. దీని కారణంగా మౌలిక సదుపాయాలకు పునాది వేయడానికి అవసరమైన వనరులను ఏర్పాటు చేయడం కష్టం. ఇది కాకుండా, ఇక్కడ వాతావరణంలో పని చేయడం కూడా కార్మికులు, కూలీలు, సిబ్బందికి ఎంతో కష్టంతో కూడుకున్నది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..