AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity bill: మీ కరెంటు బిల్లును సగానికి తగ్గించే సూపర్ పవర్ సేవర్‌..! కేవలం రూ.589కి అందుబాటులో..

ఎందుకంటే మీ నెలవారీ కరెంటు బిల్లు 800 నుండి 1000 రూపాయలు ఉంటే. ఈ పేవర్ సేవర్ మీ ఇంట్లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత 400 నుంచి 500 రూపాయలకు తగ్గుతుందని చెబుతున్నారు. ఇది ఎలా పని చేస్తుంది? ఇంట్లోని రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్‌లతో సహా ఇతర ఎలక్ట్రికల్ పరికరాలపై వృధా అవుతున్న అనవసరమైన విద్యుత్‌ను..

Electricity bill: మీ కరెంటు బిల్లును సగానికి తగ్గించే సూపర్ పవర్ సేవర్‌..!  కేవలం రూ.589కి అందుబాటులో..
Md Proelectra
Jyothi Gadda
|

Updated on: Apr 22, 2023 | 11:54 AM

Share

అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్ డీజిల్ గిట్టుబాటు కావడం లేదు. ఇంటి విద్యుత్ బిల్లు మరింత తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఎండాకాలం వస్తే కరెంటు వాడకం రెండింతలు అవుతుంది. ఎండల వేడి మొదలైంది. ఏసీ, ఫ్యాన్‌ లేకుండా ఇంట్లో ఉండలేం. తాగడానికి చల్లటి నీరు, శీతలపానీయాలు అవసరం. దీంతో కరెంటు ఖరీదుగా మారింది. బిల్లు తడిసి మోపెడు అవుతుంది. గతంలో కంటే యూనిట్ విద్యుత్ ధర కూడా పెరిగింది. దాంతో బిల్లు బారేడు పెరిగిపోతుంది. ప్రతి నెలా వెయ్యి రూపాయలకు పైగా కరెంటు బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మీ విద్యుత్ బిల్లును సగానికి తగ్గించడానికి పవర్ సేవర్ పరికరం అందుబాటులోకి వచ్చింది. దీని కోసం కొత్త పవర్ సేవర్ పరికరం ఆన్ లైన్ మార్కెట్ ఫ్లిప్ కార్ట్లో ఉంది. ఇది అమలైతే 45 శాతం విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఈ పవర్ సేవర్‌ను అమర్చడం ద్వారా మీ నెలవారీ విద్యుత్ బిల్లు సగానికి తగ్గుతుందని MD Proelectra కంపెనీ చెబుతోంది. ఈ సేవర్ పేరు MD ప్రోఎలెక్ట్రా పవర్ సేవర్.

ఎండీ ప్రొఎలెక్ట్రా పవర్ సేవర్‌ను ఏర్పాటు చేస్తే నెలవారీ విద్యుత్ బిల్లు 45 శాతం తగ్గుతుందని ఎండీ ప్రొఎలెక్ట్రా కంపెనీ పేర్కొంది. ఈ ఉత్పత్తి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.800. కానీ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ద్వారా రూ.589కి అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ పవర్ సేవర్ పరికరాన్ని కొనుగోలు చేసిన తర్వాత..ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించాలి. వారు దీనిని మీ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారు. దీంతో అనవసర విద్యుత్ వృథాను నివారించవచ్చు. అనవసరంగా విద్యుత్తును ఉపయోగించకుండా ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలను నిరోధిస్తుందో కంపెనీ పేర్కొంది. ఈ ఉత్పత్తి ఎంత వారంటీ, ఎంత విద్యుత్ ఆదా అవుతుంది అనే దాని గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం కంపెనీ క్లెయిమ్ చేసిన సమాచారం మాత్రమే.

ఇవి కూడా చదవండి

MD Proelectra కంపెనీ ప్రకారం, మీరు ఈ సేవర్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే మీ నెలవారీ కరెంటు బిల్లు 800 నుండి 1000 రూపాయలు ఉంటే. ఈ పేవర్ సేవర్ మీ ఇంట్లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత 400 నుంచి 500 రూపాయలకు తగ్గుతుందని చెబుతున్నారు. ఇది ఎలా పని చేస్తుంది? ఇంట్లోని రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్‌లతో సహా ఇతర ఎలక్ట్రికల్ పరికరాలపై వృధా అవుతున్న అనవసరమైన విద్యుత్‌ను ఈ పరికరం ఎలా నియంత్రిస్తుందనే దాని గురించి సమాచారం ఇవ్వలేదు.

ఈ ఎలక్ట్రిక్ పవర్ సేవర్‌ను ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆమోదం తీసుకోవాలో ఏమో సమాచారం లేదు. కానీ ఇ-కామర్స్‌లో ఇప్పుడు చాలా మంది ఈ పవర్ సేవర్‌ని కొనుగోలు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..