సింహం బారినుండి పశువుల మందను రక్షించిన వీధి కుక్క.. వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..

ప్రధానంగా అడవి జంతువులు ఆహారం, ఆశ్రయం కోసం ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి. అయితే అడవుల్లో పెరుగుతున్న మానవ ఆక్రమణలు, వాతావరణ పరిస్థితులు, ఆహార కొరతతో వన్యప్రాణులు ఆహారం వెతుక్కుంటూ మానవ నివాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.ఈ అద్భుతమైన దృశ్యం చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

సింహం బారినుండి పశువుల మందను రక్షించిన వీధి కుక్క.. వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..
Street Dog Leads
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 22, 2023 | 9:32 AM

గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌కు సమీపంలోని గ్రామాలలో తరచూ పులులు, సింహాలు సంచరించటం మనం చూస్తుంటాం. జనావాసాల్లోకి వచ్చిన పులులు, సింహాలను చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటారు. ఇక అర్ధరాత్రుళ్లు వీధుల్లో పులులు, సింహలు గుంపులుగా కూడా సంచరించే దృశ్యాలు పలుమార్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే, తాజాగా గ్రామంలో ప్రవేశించిన ఒక సింహాం పశువులను వేటాడేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ సింహం నుంచి పశువుల మంద ప్రాణాలు కాపాడుతున్న వీధి కుక్కను ఎప్పుడైనా చూశారా? అవును ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వీధి కుక్క సింహం బారినుంచి పశువుల మందను రక్షించినట్టుగా తెలుస్తుంది.

సింహం భయంకరమైనది, బలమైనది, అడవిలో నివసిస్తుంది.. అడవికి రారాజుగా చెబుతారు. ప్రధానంగా అడవి జంతువులు ఆహారం, ఆశ్రయం కోసం ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి. అయితే అడవుల్లో పెరుగుతున్న మానవ ఆక్రమణలు, వాతావరణ పరిస్థితులు, ఆహార కొరతతో వన్యప్రాణులు ఆహారం వెతుక్కుంటూ మానవ నివాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.ఈ అద్భుతమైన దృశ్యం చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఒక గ్రామ రహదారిపై భయంతో పశువుల మంద పరుగులు తీస్తోంది. ఇంతలో ఓ కుక్క మొరుగుతూ మందను వెంబడిస్తూ కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే, కుక్క అసహనంగా మొరుగుతూనే ఉంది. మరొక వ్యక్తి చీకటి నుండి కుక్కను సమీపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ చీకటి బొమ్మ దగ్గరికి వచ్చేసరికి కుక్క మొరుగుతూనే అటువైపు పారిపోతుంది. చీకట్లోంచి బయటపడ్డ సింహం పశువుల మంద వెనుక పరుగెత్తుతూనే కనిపించింది. అప్పుడు గానీ, అర్థం కాలేదు.. సింహం బారినుండి వీధి కుక్క పశువుల మందను కాపాడుతూ పరిగెత్తిస్తుందని,  ఆ కుక్క వెనుకుండి పశువుల మందను సింహం నుండి దూరంగా నడిపిస్తుందని తెలిసిన తర్వాత నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. వీడియోపై భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు.

CCTV IDIOTS ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో గ్రామంలోని ఒక ఇంటిపై అమర్చిన CCTV ఫుటేజీ. ఈ వీడియోను 2.7 మిలియన్లకు పైగా వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..