AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Heart Attack: ఆగిన మరో చిట్టి గుండె.. క్రికెట్ ఆడుతూ 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి

గుండెపోటు వచ్చిన సమయూరంలో బాలుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అకస్మాత్తుగా బాలుడు ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. స్నేహితులు వెంటనే ఈ విషయాన్ని మృతుడి తండ్రికి తెలియజేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాలుడు పరిస్థితిని చూసిన వైద్యులు అతన్ని పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని చెప్పారు.

Child Heart Attack: ఆగిన మరో చిట్టి గుండె.. క్రికెట్ ఆడుతూ 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి
Child Heart Attack
Surya Kala
|

Updated on: Apr 22, 2023 | 12:07 PM

Share

గత కొంతకాలంగా వివిధ కారణాలతో చిట్టి గుండె ఆగిపోతోంది. కన్నతల్లిదండ్రులకు గుండెకోతను మిగులుస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. గుండెపోటు వచ్చిన సమయూరంలో బాలుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అకస్మాత్తుగా బాలుడు ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. స్నేహితులు వెంటనే ఈ విషయాన్ని మృతుడి తండ్రికి తెలియజేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాలుడు పరిస్థితిని చూసిన వైద్యులు అతన్ని పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని చెప్పారు. వెంటనే వైద్యులు బాలుడికి చికిత్స ప్రారంభించారు. అయినప్పటికీ చిన్నారి బాలుడు మృతి చెందాడు. ఇంత చిన్న పిల్లాడికి గుండెపోటు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సమాచారం ప్రకారం..  మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని వనూరి ​​ప్రాంతంలో గురువారం సాయంత్రం 14 ఏళ్ల విద్యార్థి వేదాంత్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఆట సాగుతున్న కొద్ది సేపటికే బాలుడికి  తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో చిన్నారి బాలుడు నేలపై పడి బాధపడుతూ గిలగిలాడాడు. ఇది చూసిన ఇతర పిల్లలు వెంటనే విషయాన్ని వేదాంత్ తండ్రికి తెలియజేశారు.

వేదాంత్ ను వనూరిలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వేదాంత్ కు ప్రథమ చికిత్స అందించిన అనంతరం పెద్ద ఆసుపత్రికి తరలించమని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వేదాంత్ ను  ఫాతిమానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి చూసి వైద్యులు అడ్మిట్‌ చేసుకుని  చికిత్స ప్రారంభించినా వేదాంత్ మృతి చెందాడు. గుండె ఆగిపోయి వేదాంత్ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులు, వైద్యులను విచారించారు. వనూరి ​​పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారి మృతికి వైద్యులు కార్డియాక్ అరెస్ట్ అని చెప్పారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఇంత చిన్న పిల్లాడికి ఎందుకు వచ్చిందో, ఎలా జరిగిందో ఆరా తీస్తున్నారు పోలీసులు. వేదాంత్ తో ఆడుకుంటున్న ఇతర పిల్లలను కూడా విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..