AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending News: కారులో హెల్మెట్ పెట్టుకోలేదని వెయ్యి రూపాయల ఫైన్.. డ్రైవర్ వినూత్న నిరసన

ఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ పెట్టుకోలేదని కారు నడుపుతున్న డ్రైవర్ కు రూ.1000 ఫైన్ వేశారు. ఈ విచిత్ర ఘటన హమీర్‌పూర్ జిల్లాలో వెలుగులో చూసింది. జిల్లాకు చెందిన ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రత్యేకమైన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది.

Trending News: కారులో హెల్మెట్ పెట్టుకోలేదని వెయ్యి రూపాయల ఫైన్.. డ్రైవర్ వినూత్న నిరసన
Hamirpur Car Driver
Follow us
Surya Kala

|

Updated on: Apr 22, 2023 | 11:28 AM

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.. అలా పాటించని వాహనదారులకు హెచ్చరికగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటారు. బైక్ మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ ధరించాలి… కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి వంటి అనేక రూల్స్ ను పాటించేలా చూస్తారు. రూల్స్ ని అతిక్రమించే వాహనదారులకు ఫైన్ వేస్తారు. అయితే కారుని డ్రైవ్ చేస్తున్న ఓ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసుల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ పెట్టుకోలేదని కారు నడుపుతున్న డ్రైవర్ కు రూ.1000 ఫైన్ వేశారు. ఈ విచిత్ర ఘటన హమీర్‌పూర్ జిల్లాలో వెలుగులో చూసింది. జిల్లాకు చెందిన ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రత్యేకమైన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది.

ముస్కరా పట్టణానికి చెందిన పవన్‌కుమార్‌ ఏప్రిల్‌ 18న తన కారులో వార్త పత్రికలను వేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. అప్పుడు కారుని ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. విధుల్లో ఉన్న స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నందకిశోర్‌ యాదవ్‌ కారు ఫొటో తీసి రూ.1,000 చలాన్‌ విధించారు. తనకు ఎందుకు జరిమానా విధించారని పవన్ ఇన్స్పెక్టర్ ను ప్రశ్నించాడు. దీంతో కారుని నడుపుతూ హెల్మెట్‌ పెట్టుకోలేదని చలాన్‌ వేసినట్లు ట్రాఫిక్‌ పోలీసులు సమాధానం విని పవన్ షాక్ తిన్నాడు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు ఈ చలానాకు సంబంధించిన మెసేజ్ పవన్ సెల్ ఫోన్ కు వచ్చింది. దీంతో పవన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు డ్రైవర్‌ హెల్మెట్‌ పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేసి చలానా రద్దు చేస్తామని హామీనిచ్చారు. అయినప్పటికీ చలానా రద్దు అవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ ట్రాఫిక్ ఫైన్ రూ. వెయ్యి చెల్లించాడు. అనంతరం పోలీసుల చర్యలపై తన నిరసనను భిన్నంగా తెలియజేస్తున్నాడు.

పవన్ ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తూ.. కారులో డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ ధరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..