- Telugu News Photo Gallery Spirit of Goa Festival from 21st to 23rd april details know in Telugu News
Spirit of Goa Festival : ‘స్పిరిట్ ఆఫ్ గోవా’.. మీకు ఆహ్వానం పలుకుతోంది…మూడు రోజుల పండగలో అన్ని విశేషాలే..!
సమ్మర్ వెకేషన్‌లో సరదాగా గడిపేందుకు చాలా మంది గోవా టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. గోవాలో పార్టీ, నైట్ లైఫ్, విదేశాల్లోని యువతకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం ప్రపంచ పర్యాటకుల్ని గోవా ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇక్కడ 3-రోజుల పండుగ స్పిరిట్ ఆఫ్ గోవా సందడి మొదలైంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 22, 2023 | 12:47 PM

సంస్కృతికి, వినోదానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం గోవా. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ గోవా పేరుతో పండగ నిర్వహిస్తారు. ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పండుగ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..(ఫోటో: Insta/@shreeniwasgadiyar)

స్పిరిట్ ఆఫ్ గోవా ఏప్రిల్ 21 నుండి ప్రారంభమై ఏప్రిల్ 23 ఆదివారంతో ముగుస్తుంది. వారాంతాల్లో చిన్న ప్రయాణాలకు ఈ ఫెస్ట్ గొప్ప ఎంపిక. ఈ ఫెస్ట్‌ని గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తోంది. (ఫోటో: Insta/@dsouzaaubrey)

ఈ ఈవెంట్ కోల్వా బీచ్‌లో నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ ఫెస్ట్ ఆనందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది స్థానిక ప్రజలకు కొత్త, ప్రత్యేకమైన అనుభూతిని కూడా కలిగిస్తుంది. (ఫోటో: Insta/@miniribeiro1)

దక్షిణ గోవాలో జరుపుకునే ఈ పండుగలో కొబ్బరి నుండి జీడిపప్పు వరకు ఎన్నో రకాలైన వంటకాలు, వస్తువులు అందుబాటులో ఉంటాయి. అనేక ఆహార ఉత్పత్తులు, వంటకాలు,పానీయాలు ఇక్కడ ఆనందించవచ్చని డిపార్ట్‌మెంట్ చెబుతోంది. (ఫోటో: Insta/@ftr_vinylbar)

విశేషమేమిటంటే, ఇక్కడ ఫుడ్ అండ్ డ్రింక్ ఈవెంట్‌లు కూడా నిర్వహిస్తారు. ఇందులో మాస్టర్ చెఫ్‌లు తయారు చేసిన గోవా ప్రసిద్ధ వంటకాలు రుచి చూపిస్తారు.. గోవాను సందర్శించడంతో పాటు, ఈ ఈవెంట్‌ను ఆస్వాదించడం ఒక ప్రత్యేకమైన అనుభవం. (ఫోటో: Insta/@nancy.w121)




