Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలికి నల్ల దారం కట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..? ఏ కాలికి కట్టాలంటే..

ఇకపోతే, పిల్లల చేతులు, కాళ్లు, మెడ, నడుము చుట్టూ కూడా నల్ల దారం కడతారు. ఇదంతా ఎందుకు? ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా..? అని మీకు ఎప్పుడైనా సందేహం రావొచ్చు. కానీ, వాస్తవానికి కాలికి నల్ల దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు..

కాలికి నల్ల దారం కట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..? ఏ కాలికి కట్టాలంటే..
Wearing Black Thread
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 22, 2023 | 1:34 PM

కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం మీరు చాలా మందిని చూసే ఉంటారు. కొందరు స్టైల్‌ కోసం ధరించవచ్చు. కానీ, చాలా మంది జ్యోతిష్య కారణాల వల్ల ఇల కాలికి నల్లదారం కట్టుకుంటారు. ఇకపోతే, పిల్లల చేతులు, కాళ్లు, మెడ, నడుము చుట్టూ కూడా నల్ల దారం కడతారు. ఇదంతా ఎందుకు? ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా..? అని మీకు ఎప్పుడైనా సందేహం రావొచ్చు. కానీ, వాస్తవానికి కాలికి నల్ల దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు.. ఈ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

శని దోషం నుండి రక్షణ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం ద్వారా శని దోషం ప్రతికూల ప్రభావాలు తటస్థీకరిస్తాయి. మీ కుండలిలో శని దోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక నల్ల దారాన్ని తీసుకుని భక్తితో శనివారం నాడు మీ కాలికి కట్టుకోవాలని సూచిస్తున్నారు.

రాహు కేతువు కోపం ఉపశమనం.. ఛాయా గ్రహాలు రాహు, కేతువులు మీ పట్ల ఆగ్రహంగా ఉంటే, శత్రు గ్రహం, ఇంట్లోకి ప్రవేశించి, మీ గృహ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి.. అలాంటప్పుడు మీరు మీ ఎడమ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆర్థిక సమస్యలకు దూరం.. కాలికి నల్ల దారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది. మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. మీరు మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు మీ కుడి కాలికి నల్ల దారం కట్టాలి.

కనపడకుండా దాచుకోవటం.. తీవ్రమైన ద్వేషం,మనుసు నిండా కుళ్లు, కుట్రలతో ఉన్న ప్రతికూల వ్యక్తులు ఎవరినైనా చూసి అసూయ చెందితే హాని చేస్తారు. పిల్లలు కారణం లేకుండా ఏడ్చినా, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయినా నల్ల దారం నరదిష్టికి నివారణగా పని చేస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్న మాట.

నల్ల దారాన్ని కట్టే నియమాలు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 ముడులు వేసిన తర్వాతే దారాన్ని కట్టుకోవాలి. మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు. జ్యోతిష్యుడు సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభ దినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి. నల్ల దారం ప్రభావాన్ని తీవ్రతరం చేయడానికి, గాయత్రీ మంత్రాన్ని ధరించిన తర్వాత ప్రతిరోజూ జపించండి. అలాగే, మీరు దీన్ని ప్రతిరోజూ ఒకే సమయంలో చేయాలి. మీరు దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)