- Telugu News Photo Gallery Coronavirus safety keep these 5 gadgets at home to protect your family Telugu News
Coronavirus Safety: మరోమారు పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. ఇంట్లో తప్పక ఉంచుకోవాల్సినవి ఇవే!
కరోనా వైరస్ కొత్త కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అంటువ్యాధిని నివారించడంలో సహాయపడే అనేక గాడ్జెట్‌లు మార్కెట్లో ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యుల భద్రతను కూడా కోరుకుంటే, ఖచ్చితంగా ఈ 5 గాడ్జెట్‌లను మీ ఇంట్లో ఉంచుకోండి..
Updated on: Apr 22, 2023 | 1:55 PM

Pulse Oximeter Freepik- కోవిడ్ కారణంగా రోగి పల్స్, ఆక్సిజన్ స్థాయి మారుతుంది. ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి పల్స్, ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటే చాలా ప్రమాదం. దీంతో పల్స్ ఆక్సిమీటర్ ఇంట్లో ఉంచుకుంటే.. ఇంట్లో ఎవరికైన కరోనా సోకితే వారి పల్స్‌రేట్, ఆక్సిజన్ లెవల్స్‌ను ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎదైనా ఎమర్జెన్సీ ఉంటే త్వరగా వైద్యుడిని సంప్రదించడానికి ఆస్కారం ఉంటుంది.

Infrared Thermometer Freepi- జ్వరం అనేది కోవిడ్ ఇన్‌ఫెక్షన్ సాధారణ లక్షణం. కాబట్టి వారి టెంపరేచర్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ అవసరం. థర్మామీటర్‌లో కరోనా సోకిన వ్యక్తి టెంపరేచర్ ఒకవేళ ఎక్కువగా ఉంటే, తగు జాగ్రత్తలు పాటించడానికి, వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది.

Digital Blood Pressure Moni- డిజిటల్ బ్లడ్ ప్రెజర్ మానిటర్ ఒక గొప్ప పరికరం. మీ కుటుంబంలో ఎవరైనా రక్తపోటు సమస్య ఉన్నట్లయితే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా ఇంట్లో డిజిటల్ బ్లడ్ ప్రెజర్ మానిటర్ ఉంచుకోవడం మంచిది. ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే వారి శరీర లక్షణాలను ట్రాక్ చేయడానికి డిజిటల్ బ్లడ్ ప్రెజర్ మానిటర్ ఉపయోగపడుతుంది. తద్వారా వైద్య చికిత్స సకాలంలో పొందవచ్చు.

Steamer And Nebulizer Machi- స్టీమర్, నెబ్యులైజర్ మెషిన్ జలుబు, ఫ్లూ విషయంలో చాలా సహాయపడుతుంది. దీనిని ఉపయోగించి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మెషిన్ ఉబ్బసం ఉన్న వ్యక్తులకు బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికైనా కరోనా సోకితే, వారికి జలుబు, దగ్గు లక్షణాలుంటే, ఈ మెషిన్ ద్వారా వారికి త్వరగా ఉపశమనం కల్పించవచ్చు.

Uv C Sanitizer Or Lamp Amaz- కరోనాను నివారించడానికి పరిశుభ్రత చాలా ముఖ్యం. అందుకే రోజువారీ వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇన్‌ఫెక్షన్లు లేకుండా ఉండడం చాలా ముఖ్యం. వివిధ అవసరాల కోసం వాడే ఫోన్, కీ వంటి వస్తువులపై సూక్ష్మ క్రిములు ఉంటాయి. దీంతో వాటిపై ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడానికి UV-C శానిటైజర్ మెషీన్స్, ల్యాంప్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం వీటిలో స్పెషల్‌గా ఓ లైట్ ఉంటుంది.





























