Watch: కాశ్మీర్‌గా మారిన ఒడిశా..! ఎటు చూసినా తెల్లటి మంచుగుట్టలే..!! ఫోటోలు, వీడియోలు చూస్తేగానీ నమ్మలేరు..
ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచుగడ్డలతో ప్రజలు ఒకింత షాక్‌కు గురయ్యారు. తమ జీవితకాలంలో ఎన్నడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదంటూ జిల్లా వాసులు చెబుతున్నారు. అక్కడి దృశ్యాలు చూస్తుంటే.. అదేదో కాశ్మీర్ లేదా మరేదైనా హిల్ స్టేషన్ లో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది..
వాతావరణ మార్పుల ప్రభావమో లేదంటే ప్రకృతి ప్రకోపమో తెలియదు గానీ, ఒడిశా ఇప్పుడు కాశ్మీర్ మంచు కొండల్ని తలపిస్తుంది. ఒడిశాలోని దక్షిణ నబరంగ్‌పూర్ జిల్లాలో ఆదివారం పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. కుండపోతగా కురిసిన భారీ వడగళ్ల వాన ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచుగడ్డలతో ప్రజలు ఒకింత షాక్‌కు గురయ్యారు. తమ జీవితకాలంలో ఎన్నడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదంటూ జిల్లా వాసులు చెబుతున్నారు. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన నివాసిత ప్రాంతాలపై గుర్తుపట్టలేనంగా విధ్వంసం సృష్టించింది. కుప్పలుగా కురిసిన వడగాళ్లతో రోడ్లు, రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ ప్రాంతం మొత్తం దాదాపు ఐదు నుండి ఆరు అంగుళాల మందపాటి వడగళ్లతో నిండిపోయింది. అక్కడి దృశ్యాలు చూస్తుంటే.. అదేదో కాశ్మీర్ లేదా మరేదైనా హిల్ స్టేషన్ లో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది..
Odisha’s Nabarangpur turns into Kashmir as severe hailstorm covers dist in white blanket#Odisha #Nabarangpur #Hailstormhttps://t.co/U1wdKBJ3SL
ఇవి కూడా చదవండి— OTV (@otvnews) April 24, 2023
జిల్లాలోని పూజారిగూడ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో వడగళ్ల వాన ప్రభావం తీవ్రంగా పడింది. వర్ష బీభత్సం చూసిన వృద్ధులు..తమ జీవితంలో ఇంతటి వడగళ్ల వానను ఎప్పుడూ చూడలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వడగళ్ల వాన భారీ విధ్వంసం సృష్టించిందని స్థానికులు వాపోతున్నారు.
ఈదురు గాలుల ప్రభావంతో పలు చెట్లు నేలకూలాయి. చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, కూలిపోయాయి..పంటలు చేతికి రాకుండా పూర్తిగా నాశనమైపోయాయి. రైతులు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పరిపాలన అధికారులు పరిశీలించి తమను ఆదుకోవాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు.