AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man ki Baat: 100 కోట్ల మందికి చేరువైన ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌.. ఐఐఎమ్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

దేశంలోని మారుమూల ప్రాంత ప్రజలతో సైతం మమేకం కాశాలనే లక్ష్యంతో ప్రారంభించిందే మన్‌ కీ బాత్‌ కార్యక్రమం. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ రేడియా ద్వారా ప్రజలతో మాట్లాడుతారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలపడంతో పాటు దేశంలో...

Man ki Baat: 100 కోట్ల మందికి చేరువైన ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌.. ఐఐఎమ్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు
Modi Mann Ki Baat
Narender Vaitla
|

Updated on: Apr 24, 2023 | 8:06 PM

Share

దేశంలోని మారుమూల ప్రాంత ప్రజలతో సైతం మమేకం కాశాలనే లక్ష్యంతో ప్రారంభించిందే మన్‌ కీ బాత్‌ కార్యక్రమం. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ రేడియా ద్వారా ప్రజలతో మాట్లాడుతారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలపడంతో పాటు దేశంలో పలువురు ప్రముఖుల గురించి ప్రస్తావిస్తుంటారు ప్రధాని. ఈ కార్యక్రమంపై దేశంలోని చాలా మందికి అవగాహన ఉంటుంది. ఇదిలా ఉంటే మన్‌ కీ బాత్ కార్యక్రమం తాజాగా 100వ ఎపిసోడ్‌కు చేరుకోనుంది. ఏప్రిల్‌ 30వ తేదీన జరిగే ఎపిసోడ్‌తో 100వ ఎపిసోడ్‌ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఐఐఎమ్‌ రోహ్‌తక్‌, ప్రసార భారత సంయుక్తంగా ఓ సర్వేను నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఈ సర్వే ప్రకారం దేశంలో ఇప్పటి వరకు మన్‌ కీ బాత్ కార్యక్రమాన్ని దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైనా విన్నట్లు తేలింది. అలాగే సుమారు 23 కోట్ల మంది ప్రతీ నెల ప్రసారమయ్యే మన్‌ కీ బాత్‌ కార్యమ్రాన్ని వింటున్నారు. సర్వేలో వెల్లడైన వివరాలను ప్రసార భారతి సీఈవో శ్రీ గౌరవ్ ద్వివేది, ఐఐఎం రోహ్‌తక్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ పి.శర్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం దేశంలో సుమారు 23 కోట్ల మంది ప్రతీ నెల కచ్చితంగా కార్యక్రమాన్ని వింటుంటడగా, మరో 41 కోట్ల మంది అప్పుడప్పుడు మన్‌ కీ బాత్‌ వింటున్నట్లు తేలింది.

మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ఇంతలా ప్రజాదరణ పొందడానికి గల కారణాలను కూడా ఈ సర్వేలో ప్రస్తావించారు. అంతేకాకుండా ప్రజలను అంతలా ఆకర్షించే విషయాల జాబితాను రూపొందించింది. సర్వేలో తేలిన అంశాల ఆధారంగా మన్‌ కీ బాత్‌పై ప్రజల్లో ఎలాంటి సానుకూల దృక్పథం ఏర్పడిందన్న అంశాలను సైతం ప్రస్తావించారు. వీరిలో 60 శాతం మంది జాతి నిర్మాణంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ఇక 59 శాతం మందికి ప్రభుత్వంపై నమ్మకం పెరిగినట్లు తేలింది. అలాగే 58 శాతం మంది తమ జీవితాలు మెరుగైనట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక మన్‌ కీ బాత్‌లో భాగంగా ఎక్కువగా పాపులర్‌ అయిన థీమ్స్‌లో సైన్స్‌ రంగంలో భారత్‌ సాధించిన ఘనతలు, సామాన్యుల విజయగాధలు, యువతకు సంబంధించి కథనాలు, వాతావరణ, సహజ వనరులకు సంబంధించిన సమస్యలకు మంచి ఆదరణ లభించినట్లు సర్వేలే వెల్లడైంది. ఇదిలా ఉంటే మన్‌ కీ బాత్‌ కార్యక్రామాన్ని ఎలా వింటున్నరాన్న దానికి 19 నుంచి 31 ఏళ్ల మధ్య వయసున్న 62 శాతం మంది, 60 ఏళ్ల పైబడిన వారు 3.2 శాతం టెలివిజన్‌లో వింటున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 44.7 శాతం మంది మన్‌ కీ బాత్‌ను టీవీలో విన్నారు. 37.6 శాతం మంది నెలవారీ ప్రసారాన్ని యాక్సెస్ చేయడానికి మొబైల్‌ను ఉపయోగించగా, 17.6 శాతం మంది మాత్రమే రేడియోను ఉపయోగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..