ప్రధాని మోదీకి కేరళలో ఘనస్వాగతం లభించింది. కొచ్చిలో భారీ రోడ్‌షో నిర్వహించారు మోదీ. కారు దిగి పాదయాత్ర చేశారు. కొచ్చిలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. కేరళలో 18 శాతం జనాభా ఉన్న క్రిస్టియన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది.
కొచ్చిలో క్రైస్తవ మతపెద్దలతో భేటీ అవుతారు మోదీ. రెండు రోజుల పాటు మోదీ కేరళలో పర్యటిస్తారు. ప్రధాని మోదీపై స్థానికులు పూలవర్షం కురిపించారు. కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభిస్తారు మోదీ.