- Telugu News Photo Gallery Cricket photos Sachin Tendulkar Birthday Special, Know about Sachin Tendulkar love life with wife Anjali Tendulkar
Sachin Tendulkar Love Story: సచిన్ టెండూల్కర్ ప్రేమకథ మామూలుగా లేదుగా.. జర్నలిస్టు వేషధారణలో సచిన్ తల్లిని కలవడానికి వెళ్లిన అంజలి.. కట్ చేస్తే..
తొలి చూపులో ప్రేమ, వివాహం నుంచి ఇద్దరు పిల్లలతో సంతోషకరమైన కుటుంబం. సచిన్ టెండూల్కర్ కెరీర్ లాగే అతని వ్యక్తిగత జీవితం కూడా సూపర్. ఎక్కడా గ్యాప్ లేదు. ఆమె డాక్టర్ అయినప్పటికీ ఫ్యామిలీ కోసం బంగారం లాంటి కెరీర్‌ను పణంగా పెట్టింది అంజలి. టీమిండియా క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ సతీమణి. సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా కపుల్ గోల్స్ సెట్ చేసిన అంజలి- సచిన్ ప్రేమకథ ఇప్పుడు మీ కోసం.
Updated on: Apr 24, 2023 | 7:12 PM

ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక స్త్రీ సహకారం ఉంటుంది. సచిన్ టెండూల్కర్ విజయవంతమైన కెరీర్ వెనుక అంజలి టెండూల్కర్ సహకారం ఎంత..? దీనికి సచిన్ మాత్రమే సమాధానం చెప్పగలడు. అయితే అంజలి లాంటి సరైన లైఫ్ పార్టనర్ దొరకకపోతే సచిన్ జీవితంలో చాలా విషయాలు మిగిలి ఉండేది..

సచిన్ కంటే అంజలి ఆరేళ్లు పెద్దది. పెళ్లికి వధువు వయస్సు గురించి సమాజంలోని అపోహలను అతను బద్దలు కొట్టాడు. నేటికీ పెళ్లిలో వయసు అనే టాపిక్ వచ్చినప్పుడు సచిన్-అంజలిని ఉదాహరణగా తీసుకువస్తున్నారు.

సచిన్ ప్రేమపై ఓ సినిమా తీయవచ్చు. 1990లో ఎయిర్‌పోర్టులో అంజలిని సచిన్ తొలిసారిగా చాలా చిత్రమైన రీతిలో చూశాడు. గుంపులో చాలా మధురమైన ముఖాన్ని చూడగానే కర్లీ జుట్టు గల కుర్రాడి గుండెలో గంటలు మ్రోగాయి..

సచిన్ ఇంగ్లండ్ టూర్ ముగించుకుని తిరిగి వస్తున్నాడు. అంజలి తల్లిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఆ రోజు ఎయిర్‌పోర్టులో సచిన్ ఎవరనేది అంజలికి తెలిసింది. ఆ సమయంలో అంజలి మెడిసిన్ చేసేది. అంజలికి క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేదు.. కానీ అది వారి ప్రేమను అడ్డుగా మారలేదు. విమానాశ్రయంలో సచిన్ అందమైన యువతిని కలిశాడు.

ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. ఓ రోజు అంజలి జర్నలిస్టుగా సచిన్ ఇంటికి వెళ్లింది. అలా ఓ రోజు అంజలి తొలిసారి సచిన్ ఇంటికి వెళ్లటం. అయితే సచిన్‌కు అంజలి చాక్లెట్లు ఇవ్వడంపై అతడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. 'నువ్వు నిజంగా జర్నలిస్టువా?' అని ప్రశ్నించింది.

ప్రేమించుకునే తొలి రోజుల్లో ఇద్దరూ కలిసి ఓ రోజు "రోజా" సినిమా చూసేందుకు వెళ్లారు. అంజలి కోరిక మేరకు సచిన్ మారువేషంలో థియేటర్‌లోకి వచాడు. కానీ విరామ సమయంలో ప్రేక్షకులు సచిన్‌ని గుర్తుపట్టారు. అలా, సినిమాను మధ్యలోనే వదిలేసి హాలు నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది.

1990లలో మొబైల్ ఫోన్స్ చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి సచిన్‌తో మాట్లాడాలంటే తన కాలేజీ క్యాంపస్ దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లి అక్కడ నుంచి కాల్ చేసేదట. అయితే, సచిన్ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా బిల్ ఎక్కువగా వస్తుందని భావించి లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. అప్పట్లో ఒక ఫోన్ కాల్ కి చాలా డబ్బు ఖర్చయ్యేది. డబ్బు ఆదా చేయాలని అంజలి సచిన్‌కు లేఖలు రాసేది.

ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. పెళ్లి విషయాన్ని అంజలి కుటుంబ సభ్యులకు సచిన్ చెప్పలేకపోయాడు. తమ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు సచిన్ మొహమాట పడటంతో అంజలినే స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించింది.1994లో సచిన్, అంజలిల నిశ్చితార్థం న్యూజిలాండ్‌లో జరిగింది. ఆ తర్వాత 1995 మే 24న పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం 30 ఏళ్లకు చేరువైంది.




