కోళ్లకోసం వచ్చి బావిలో పడిన ఎలుగుబంటి !! చివరికి  ఏం జరిగిందంటే ??

కోళ్లకోసం వచ్చి బావిలో పడిన ఎలుగుబంటి !! చివరికి ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Apr 24, 2023 | 9:22 PM

కోళ్ల కోసం వచ్చి పాపం నీళ్లలో పడిపోయింది ఓ ఎలుగుబంటి. ఈ సంఘటన కేరళ త్రివేండ్రంలో జరిగింది. ఆహారంకోసమో, నీటి కోసమో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తుంటాయి. అలా అటవీప్రాంతం నుంచి నగరం వైపు వచ్చిన ఓ ఎలుగుబంటి ఓ ఇంట్లోకి ప్రవేశించింది...

కోళ్ల కోసం వచ్చి పాపం నీళ్లలో పడిపోయింది ఓ ఎలుగుబంటి. ఈ సంఘటన కేరళ త్రివేండ్రంలో జరిగింది. ఆహారంకోసమో, నీటి కోసమో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తుంటాయి. అలా అటవీప్రాంతం నుంచి నగరం వైపు వచ్చిన ఓ ఎలుగుబంటి ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంటి యజమాని పెంచుకుంటున్న కోళ్లను చూసిన ఆ ఎలుగుబంటి వాటిని తన ఆహారంగా చేసుకోవాలనుకుంది. వెంటనే రంగంలోకి దిగింది. ఆకోళ్లను పట్టుకునే క్రమంలో అక్కడే ఉన్న బావిలో పడిపోయింది. బయటకు వచ్చే మార్గంలేక లబోదిబోమంది. బావిలోనుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయని గ్రహించిన ఇంటి యజమాని ప్రభాకరన్‌ ఏంజరిగిందోనని వచ్చి చూడగా బావిలో ఎలుగుబంటి కనబడింది. విషయం తెలిసి స్థానికులు కూడా గుమిగూడారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఎలుగుబంటిని రక్షించేందుకు కేరళ అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాల్లో విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం.. పట్టుతప్పి 30 అడుగుల ఎత్తునుంచి..

స్వీట్‌ పెడుతూ వధువు చెంప పగలగొట్టిన వరుడు !! ఆతర్వాత ??

‘నేను డేంజర్‌లో ఉన్నా’ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్‌.. కాసేపటికే..

బాబోయ్‌.. రబ్బరు కుర్రాడు !! శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు

15 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. వీడియో వైరల్‌

 

Published on: Apr 24, 2023 09:22 PM