15 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. వీడియో వైరల్‌

కేరళలోని మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది. బయటకు రావడానికి అది అష్టకష్టాలు పడింది. అయినా అందులో నుంచి బయటపడటానికి దానికి వీలుకాలేదు. బావిలో పడిపోయిన ఏనుగును అటవీ..

15 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. వీడియో వైరల్‌

|

Updated on: Apr 24, 2023 | 9:16 PM

కేరళలోని మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది. బయటకు రావడానికి అది అష్టకష్టాలు పడింది. అయినా అందులో నుంచి బయటపడటానికి దానికి వీలుకాలేదు. బావిలో పడిపోయిన ఏనుగును అటవీ అధికారులు రక్షించారు. బావిలోనుంచి అరుపులు వినిపిస్తుండటంతో గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. జేసీబీ సహాయంతో దానిని రక్షించారు. అప్పటికే అలసిపోయిన ఏనుగు అతి కష్టంమీద బావిలోనుంచి బయటకు వచ్చింది. కాసేపు పడుకుండిపోయింది. ఆ తర్వాత లేచి నడుచుకుంటూ వెళ్ళింది. కాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘దయచేసి.. మీరెవ్వరూ నా పెళ్లికి రావద్దు’ !! కార్డ్‌ చూసి ఖంగుతిన్న బంధువులు !!

మన దేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా ??

మానవత్వం చాటుకున్న మెట్రో సిబ్బంది.. చికిత్స చేసి ప్రాణం పోసాడు

Follow us
Latest Articles