బాబోయ్‌.. రబ్బరు కుర్రాడు !! శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు

బాబోయ్‌.. రబ్బరు కుర్రాడు !! శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు

Phani CH

|

Updated on: Apr 24, 2023 | 9:17 PM

అమెరికాలో ఈ యువకుడి పేరు డేనియల్‌ బ్రౌనింగ్‌ స్మిత్‌. తనకు సోకిన అరుదైన వ్యాధిని ఓ అవకాశంగా మలుచుకున్నాడు. శరీరాన్ని వంపులు తిప్పుతూ ఏకంగా 7 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సంపాదించాడు. ‘ది రబ్బర్‌ బోయ్‌’గా గుర్తింపు పొందుతున్నాడు. ఇతడు తన శరీరాన్ని ఎటుపడితే..

అమెరికాలో ఈ యువకుడి పేరు డేనియల్‌ బ్రౌనింగ్‌ స్మిత్‌. తనకు సోకిన అరుదైన వ్యాధిని ఓ అవకాశంగా మలుచుకున్నాడు. శరీరాన్ని వంపులు తిప్పుతూ ఏకంగా 7 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సంపాదించాడు. ‘ది రబ్బర్‌ బోయ్‌’గా గుర్తింపు పొందుతున్నాడు. ఇతడు తన శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు. శరీరం మొత్తాన్ని మడత పెట్టేసుకొని ఓ పెట్టెలోకి వెళ్లిపోగలడు. ఈ గుర్తింపుతో అతడికి పలు ప్రకటనలు, సినిమాలు, టీవీ షోల్లోనూ నటించే అవకాశాలు దక్కాయి. అమెరికాలోని మెరిడియన్‌లో జన్మించిన డేనియల్‌ చిన్నపిల్లాడిగా ఉన్నపుడు బాగా ఎత్తులో నుంచి నేలపై దూకేవాడు. 2007లో ‘మోస్ట్‌ ఫ్లెక్సిబుల్‌ మ్యాన్‌’ అనే గిన్నిస్‌బుక్‌ అవార్డు దక్కించుకున్న డేనియల్‌ ఖాతాలో అలాంటి రికార్డులు మొత్తం ఏడు చేరాయి. ఇతడు తన శరీరాన్ని పలురకాలుగా వంచడానికి అసలు కారణం ‘ఎలస్‌ డన్లోస్‌ సిండ్రోమ్‌’. జన్యుపరమైన లోపం కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇందులో 13 రకాలు ఉన్నాయట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

15 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. వీడియో వైరల్‌

‘దయచేసి.. మీరెవ్వరూ నా పెళ్లికి రావద్దు’ !! కార్డ్‌ చూసి ఖంగుతిన్న బంధువులు !!

మన దేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా ??

మానవత్వం చాటుకున్న మెట్రో సిబ్బంది.. చికిత్స చేసి ప్రాణం పోసాడు

Published on: Apr 24, 2023 09:16 PM