'నేను డేంజర్‌లో ఉన్నా’ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్‌.. కాసేపటికే..

‘నేను డేంజర్‌లో ఉన్నా’ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్‌.. కాసేపటికే..

Phani CH

|

Updated on: Apr 24, 2023 | 9:18 PM

బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియాలో వీరు పెట్టిన మెసేజ్‌లు ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్‌లో ఉన్నామని, రక్షించండంటూ మెసేజ్‌లు పంపిన..

బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియాలో వీరు పెట్టిన మెసేజ్‌లు ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్‌లో ఉన్నామని, రక్షించండంటూ మెసేజ్‌లు పంపిన కాసేపటికే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. అగంతకులు ముగ్గురి యువతుల గొంతులు కోసి.. చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు. ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఓ బీచ్‌లో ఏప్రిల్ 4న జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. డెన్నిస్‌ రేనా, యులియానా మాసియస్, నయేలి తాపియా అనే ముగ్గురు యువతులు సరదాగా గడిపేందుకు ఏప్రిల్ 4న ఈక్వెడార్‌లోని ఓ బీచ్‌కు వెళ్లారు. ఐతే ఏం జరిగిందో తెలియదుగానీ బీచ్‌ ఒడ్డున కొందరు దుండగులు ముగ్గురు యువతులను వెంబడించి చాలా దూరం తరిమారు. ఈ క్రమంలో భయభ్రాంతులకు గురైన యువతులు తాము ప్రమాదంలో ఉన్నామని తెల్పుతూ సన్నిహితులకు వేర్వేరే మెసేస్ లు పంపారు. నయేలి తన సోదరుడికి రాత్రి 11:10 గంటలకు వాట్సప్ మెసేజ్ పంపింది. ఐతే సోదరుడు వెంటనే ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌కు ‘నాకేదో ప్రమాదం జరగబోతుంది.. ఒకవేళ నాకేదైనా జరిగితే, గుర్తుంచుకో ఐ లవ్‌ యూ వెరీ మచ్‌’ అని మెసేజ్ పంపింది. ఈ తర్వాత రోజే వారు బీచ్‌లో అర్ధనగ్నంగా శవాలై తేలారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌.. రబ్బరు కుర్రాడు !! శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు

15 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. వీడియో వైరల్‌

‘దయచేసి.. మీరెవ్వరూ నా పెళ్లికి రావద్దు’ !! కార్డ్‌ చూసి ఖంగుతిన్న బంధువులు !!

మన దేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా ??

మానవత్వం చాటుకున్న మెట్రో సిబ్బంది.. చికిత్స చేసి ప్రాణం పోసాడు

Published on: Apr 24, 2023 09:17 PM