Hair Care: కేవలం 2 స్పూన్ల నూనె చాలు.. గుడ్డుతో కలిపి తలకు పట్టిస్తే.. మీ జుట్టు మెరుస్తుంది..!

అందమైన మెరిసే జుట్టును పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నేటి జీవనశైలి, ఆహారపుటలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు అనేక రకాలుగా పాడవటం మొదలవుతుంది. దీంతో చాలామంది హెయిర్‌ కేర్‌ విషయంలో చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటారు. మీరు కూడా జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే.. మీకు మెరిసే జుట్టు కావాలంటే..ఇలాంటి కొన్ని హెయిర్ కేర్ చిట్కాలను పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

Hair Care: కేవలం 2 స్పూన్ల నూనె చాలు.. గుడ్డుతో కలిపి తలకు పట్టిస్తే.. మీ జుట్టు మెరుస్తుంది..!
Tips for Long Hair
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 25, 2023 | 3:29 PM

అందమైన మెరిసే జుట్టును పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నేటి జీవనశైలి, ఆహారపుటలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు అనేక రకాలుగా పాడవటం మొదలవుతుంది. దీంతో చాలామంది హెయిర్‌ కేర్‌ విషయంలో చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటారు. మీరు కూడా జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే.. మీకు మెరిసే జుట్టు కావాలంటే..ఇలాంటి కొన్ని హెయిర్ కేర్ చిట్కాలను పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

మెరిసే జుట్టు కోసం కోడి గుడ్డు ప్యాక్‌ చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. దీనిని కొబ్బరి నూనెతో కలిపి తయారు చేస్తారు. గుడ్డులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ జుట్టుకు అంతర్గత పోషణను అందిస్తుంది. మరోవైపు, కొబ్బరి నూనె మీ జుట్టును లోతుగా పోషించే అనేక లక్షణాలను కలిగి ఉంది. ఈ హెయిర్ ప్యాక్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

ఈ హెయిర్ ప్యాక్ చేయడానికి ముందుగా 2-3 గుడ్లు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 చెంచాల కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. తయారైన మిశ్రామాన్ని 2 నుండి 3 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు సహజమైన జుట్టు ప్యాక్‌ రెడీ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుండి కొనల వరకు నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. సుమారు 20 నిమిషాల తర్వాత జుట్టును మీకు నచ్చిన షాంపుతో శుభ్రంగా కడిగేసుకోవాలి. షాంపూ, కండీషనర్ వంటివి కూడా వాడటం ద్వారా గుడ్డు వాసనను వదిలించుకోవచ్చు. మెరిసే జుట్టు కోసం ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి రెండు సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..