- Telugu News Photo Gallery Cricket photos Top 5 Bowlers with Most wickets till now competing for IPL 2023 Purple Cap
Purple Cap: ఐపీఎల్ బ్యాటర్లకు చుక్కలు చూసిస్తోన్న టాప్ 5 బౌలర్లు.. లిస్టులో నలుగురు మనోళ్లే..
ఐపీఎల్ 16వ సీజన్ ఇప్పటికే సగం వరకు చేరుకుంది. ఇక పరుగుల వర్షం కురిసే ధనాధన్ లీగ్‌లో వికెట్లు పడగొట్టడం అంటే మాములు విషయం కాదు. అలాగే టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టే ఆటగాళ్లకు పర్పుల్ క్యాప్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన టోర్నీలో అత్యధిక వికట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్న టాప్ 5 ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 25, 2023 | 1:45 PM

పర్పుల్ క్యాప్ ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బైలర్ మహ్మద్ సిరాజ్ దగ్గర ఉంది. టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 28 ఓవర్లు వేసి మొత్తం 13 వికెట్లు తీసుకున్నాడు.

సిరాజ్‌తో పోటీ పడుతూ పర్పుల్ క్యాప్ రేసులో పంజాబ్ కింగ్స్ బౌలర్ ఆర్ష్‌దీప్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో 25 ఓవర్లు వేసిన ఆర్ష్‌దీప్ కూడా 13 వికెట్లు పడగొట్టాడు.

ఈ లిస్టులో యుజ్వేంద్ర చాహల్ కూడా ఉన్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో 3వ స్థానంలో ఉన్న చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున 7 మ్యాచ్‌లలో మొత్తం 28 ఓవర్లు వేసి 12 వికెట్లు తీశాడు.

బౌలింగ్‌లో సంచలన రికార్డులను కలిగిన రషిద్ ఖాన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున 6 మ్యాచ్‌లు ఆడిన రషిద్ ఈ లిస్ట్ నాల్గో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో అతను 24 ఓవర్లు వేసి 12 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్న టాప్ 5 ఆటగాళ్ల లిస్టులో తుషార్ దేశ్‌పాండే 5వ స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుగ్గా రాణిస్తున్న దేశ్‌పాండే 7 మ్యాచ్‌లలో 12 వికెట్లు పడగొట్టాడు. అతను కూడా 25 ఓవర్లు వేసి ఈ వికెట్లను పడగొట్టాడు.





























