Sridhar Babu: వాట్సాప్‌లో మీ సేవ.. పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్‌కి తెలంగాణే బెంచ్‌మార్క్
తెలంగాణను డిజిటల్ పాలనలో రోల్ మోడల్‌గా నిలబెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వాట్సాప్‌లో మీసేవ సేవలను ప్రారంభించి, ప్రజల భాగస్వామ్యంతో టెక్నాలజీ ఆధారిత గుడ్ గవర్నెన్స్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఏఐ శిక్షణ, ఏఐ సిటీ వంటి లక్ష్యాలతో టెక్నాలజీని సమానత్వ సాధనంగా చూస్తున్నామన్నారు. త్వరలో వాయిస్ కమాండ్‌తో సేవలు అందుబాటులోకి వస్తాయి.

డిజిటల్ పాలనలో దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణను నిలబెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెటా – మీసేవ భాగస్వామ్యంతో రూపొందించిన మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ను ఆయన బంజారాహిల్స్ తాజ్ కృష్ణాలో ప్రారంభించారు. గవర్నెన్స్ అనేది ప్రజలను దూరంగా ఉంచే రాచరిక ధోరణి కాదని, ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేస్తూ ప్రతి సేవను వారి గృహాల ముందువరకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ దిశ శ్రీధర్ బాబు అన్నారు. గత బీఆర్ఎస్ పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిందని, ప్రజల భాగస్వామ్యంతో టెక్నాలజీ ఆధారిత గుడ్ గవర్నెన్స్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు.
టెక్నాలజీని కేవలం సాఫ్ట్‌వేర్‌గా కాకుండా సమానత్వ సాధనంగా చూస్తున్నామని, రాష్ట్రంలోని చివరి వ్యక్తి వరకూ టెక్నాలజీ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణ ఇప్పటికే బెంచ్‌మార్క్‌గా నిలిచిందని మంత్రి వివరించారు. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారంగా తెలంగాణ డిజిటల్ ఎక్స్‌ఛేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేసిన ప్రత్యేకత తెలంగాణదేనని అన్నారు. 38 శాఖలకు చెందిన 580కు పైగా పౌర సేవలను వాట్సాప్‌లో ఫింగర్‌టిప్స్‌పై అందుబాటులోకి తేనటంతో ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్‌ను అనుసరిస్తున్నాయని అన్నారు.
జెన్ ఏఐ, మొబైల్ ఫస్ట్ అప్రోచ్‌తో పౌర సేవల డెలివరీలో తెలంగాణ కొత్త ప్రమాణాలకు నాంది పలికిందని మంత్రి తెలిపారు. త్వరలోనే తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా మీ సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు, టైప్ చేయకుండా వాయిస్ కమాండ్‌తో సేవలు పొందే అవకాశం కూడా కల్పించనున్నట్లు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




