AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy- Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. విశేషమేమిటంటే?

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌.ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాహుల్ కు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. అలాగే గద్దర్ అవార్డుతోనూ సత్కరించింది.

CM Revanth Reddy- Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. విశేషమేమిటంటే?
Rahul Sipligunj, CM Revanth Reddy
Basha Shek
|

Updated on: Nov 18, 2025 | 10:53 PM

Share

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో తన జీవితంలో ఓ కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. తన మనసుకు నచ్చిన హరిణ్యా రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు రాహుల్- హరిణ్య ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. కాగా ఇప్పుడీ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ నెల 27న రాహుల్- హరిణ్యారెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు రాహుల్ తన పెళ్లి శుభలేఖలు తీసుకుని సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు వెళుతున్నాడు. తన పెళ్లికి రావాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం (నవంబర్ 18) రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిన ప్రత్యేకంగా కలిశారు. తన పెళ్లి శభలేఖను అందజేసి వివాహ వేడుకకు రావాలని కోరాడు. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వివాహ వేడుకకు వస్తాను అని టాలీవుడ్ సింగర్ తో చెప్పినట్లు సమాచారం. కాగా  రాహుల్ సిప్లిగంజ్ వెంట అతని కాబోయే భార్య హరిణ్యా రెడ్డి కూడా ఉంది.

హరిణ్యా రెడ్డి మరెవరో కాదు లుగుదేశం పార్టీ నేత, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తెనే. రాహుల్ తో ఆమె చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంతో తమ ప్రేమ బంధాన్ని మరింత ధృఢంగా చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం రేవంత్ రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యా రెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌..
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌..
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!