AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గిరిపుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు.. మొట్టమొదటి కంటైనర్ పాఠశాల.. ఎక్కడో తెలుసా..

మన్యంలో మగ్గుతూ అక్షర జ్ఞానానికి నోచుకోని గిరిపుత్రులకు నాలుగు అక్షరాలు నేర్పాలనే తాపత్రయం ఫలించింది. మంత్రి సీతక్క తొలి ప్రయత్నం శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంది.. ఆ మన్యం గుడాల్లో పాఠశాల శాశ్వత నిర్మాణానికి అటవీశాఖ ఆంక్షలు అడ్డురావడంతో అక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటుచేసి ఆ గిరి పుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి సీతక్క..

గిరిపుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు.. మొట్టమొదటి కంటైనర్ పాఠశాల.. ఎక్కడో తెలుసా..
Seethakka
G Peddeesh Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 18, 2024 | 12:14 PM

Share

మన్యంలో మగ్గుతూ అక్షర జ్ఞానానికి నోచుకోని గిరిపుత్రులకు నాలుగు అక్షరాలు నేర్పాలనే తాపత్రయం ఫలించింది. మంత్రి సీతక్క తొలి ప్రయత్నం శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంది.. ఆ మన్యం గుడాల్లో పాఠశాల శాశ్వత నిర్మాణానికి అటవీశాఖ ఆంక్షలు అడ్డురావడంతో అక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటుచేసి ఆ గిరి పుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి సీతక్క.. దేశంలో ప్రయోగాత్మకంగా ములుగు జిల్లాలో ప్రారంభించిన ఆ కంటైనర్ ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతను మీరే చూడండి..

కోట్లాదిమంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారక్క దేవతలు కొలువైన జిల్లా.. ప్రకృతి అందాలకు నెలవు.. నిత్యం వేలాది మంది పర్యాటిస్తుంటారు. అయితే, పక్షుల కిలకిల రావాలతో సహజత్వాన్ని తన గుండెలనిండా అలముకున్న ములుగు జిల్లాలో అక్షరాలకు నోచుకొని అడవి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు.. ముఖ్యంగా గుత్తికోయగూడాల్లో కనీసం నాలుగు అక్షరాలు నేర్పే దారిలేదు.. వారికి విద్యా వైద్యం అందించాలనే తాపత్రయంతో ఆరాటపడ్డ మంత్రి సీతక్క ఆ అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపే అక్షర దీపమయ్యారు..

సీతక్క తాపత్రయానికి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ప్రయత్నం తోడైంది.. ఇంకేముంది తొలి ప్రయత్నంలోనే ఊహించని ప్రశంసలు.. గుడిసె నుంచి కంటైనర్ పాఠశాలలోకి వెళ్తున్న ఆ గిరిపుత్ర కళ్ళలో ఏదో తెలియని ఆనందం వెల్లువిరిసింది.

ప్రతిమనిషి జీవితంలో కూడు.. గుడ్డ.. గూడు ఎంత ముఖ్యమో విద్యా- వైద్యం కూడా అంతే అవసరం… అవి గుర్తించిన మంత్రి సీతక్క తన నియోజకవర్గం ప్రజలకు మెరుగైన విద్యా వైద్యం అందించాలి.. మన్యంలో మగ్గుతున్న గిరిపుత్రులను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే లక్ష్యంతో తన ప్రయత్నాలు మొదలు పెట్టారు.. మొదటి ప్రయత్నంలో భాగంగా కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటుచేసి మారుమూల ఏజెన్సీ గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మంత్రి సీతక్క ఇప్పుడు అదే మరో ప్రయత్నం చేపట్టారు.. అక్షర జ్ఞానం లేక అడవిలో మగ్గుతున్న మన్యం బిడ్డలకు మెరుగైన విద్య, వైద్యంను అందించడం కోసం అడుగులు వేస్తున్నారు.

Danasari Seethakka

Danasari Seethakka

గుత్తికోయగూడాల్లో కంటైనర్ పాఠశాలలు ఏర్పాటు చేసి..

వారికి మెరుగైన వసతులతో విద్యను అందించే ప్రయత్నాలు చేపట్టారు. తొలి ప్రయత్నం ఫలించింది. కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గ్రామంలో కంటైనర్ పాఠశాలను ఏర్పాటుచేశారు. 13 లక్షల రూపాయల వ్యయంతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో ఆధునిక వసతులతో నిర్మించారు.. విద్యుత్ సరఫరా కూడా లేని ఈ గూడల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేశారు.. ఈ కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు..

Minister Danasari Anasuya

Minister Danasari Anasuya

చుట్టూ కనీసం పొరక పుల్ల కూడా లేని గడ్డిగుడిసె కింద ఇంతకాలం అక్షరాలు దిద్దుకుంటున్న గిరి పుత్రులను ఈ కంటైనర్ పాఠశాలలోకి తరలించి వారి జీవితాల్లో అక్షర జ్ఞానాన్ని నింపే ప్రయత్నం చేశారు.. అయితే ఈ గూడాలన్ని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండటం వల్ల ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు రావడంలేదు.. అటవీశాఖ ఆంక్షలు వల్ల రోడ్ల నిర్మాణం, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి.. ఈ నేపథ్యంలో తన శక్తి మేరకు ఈ విధంగా కంటైనర్ స్కూళ్లు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నానని సీతక్క తెలిపారు.

వీడియో చూడండి..

కంటైనర్ ఆసుపత్రి.. కంటైనర్ స్కూల్స్ రూపకర్త ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ను మంత్రి సీతక్క అభినందించారు. ఈ జిల్లాలో సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో విద్యా- వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు ఇదే తరహాలో సేవలందిస్తామని.. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి శ్రమకైనా వెనుకాడదని మంత్రి సీతక్క అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..