Revanth Reddy – KTR: అటు రేవంత్ రెడ్డి.. ఇటు కేటీఆర్.. ఒకే వేదికపైకి రాజకీయ ప్రత్యర్థులు..
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మాటల తూటాలు ఎలా పేలుతాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వార్ వన్ సైడ్ కాదు.. టూ సైడ్.. అనేలా ఉంటాయి.. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సవాళ్లు ఎలా ఉంటాయో ఇంకా చెప్పాల్సిన పనే ఉండదు..
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మాటల తూటాలు ఎలా పేలుతాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వార్ వన్ సైడ్ కాదు.. టూ సైడ్.. అనేలా ఉంటాయి.. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సవాళ్లు ఎలా ఉంటాయో ఇంకా చెప్పాల్సిన పనే ఉండదు.. ప్రస్తుతం వాళ్లిద్దరి మధ్యనే మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.. ఏ విషయం పైనేనా.. వాళ్లిద్దరూ హోరాహోరీగా సవాళ్లు చేసుకుంటుంటారు.. ప్రస్తుతం కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు విపరీతమైన భాషలో విరుచుపడుతున్నారు. ప్రతిరోజు ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ కూడా నడుస్తుంది. అసెంబ్లీలోనూ అదే కొట్లాట.. రాజకీయంగానే అదే పొట్లాట.. రాజకీయంగా రెండు విభిన్న పార్టీలు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు.. ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అటు ప్రతిపక్ష పార్టీ నేతగా కేటీఆర్.. డైలీ ఏదో ఒక విషయంపై స్పందిస్తుంటారు. గతంలో కంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరూ.. ఒకే వేదికను పంచుకోనున్నారు.
ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. అదేంటి..? ఇద్దరూ ఒకే వేదికపై వస్తారా..? ఈ క్రమంలో ఇద్దరూ పలకరించుకుంటారా? ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా? అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.. అయితే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసిఆర్ ఆసుపత్రిలో ఉండగా వెళ్లి పరామర్శించారు. ఆ సందర్భంలో కేటీఆర్ స్వయంగా ఆసుపత్రిలో దగ్గరుండి తీసుకెళ్లారు. ఇద్దరు ఆప్యాయంగానే మాట్లాడుకున్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితి వేరు.. ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష పార్టీ సీపీఎం నిర్వహించే సీతారాం ఏచూరీ సంస్మరణ సభలో ఇద్దరూ వేదికపై కనిపించనున్నారు.
సెప్టెంబర్ 21న వామపక్ష దిగ్గజం, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గియ సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఉంది. ఆయన తెలుగు వ్యక్తి కావడంతో హైదరాబాదులో ఆ పార్టీ సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డిని అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరినీ ఆహ్వానించారు. రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. సీతారాం ఏచూరి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు కచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఒకే వేదికపై ఇద్దరు రాజకీయ బద్ద శత్రువులు కూర్చోనున్నారు. సమావేశం ఏదైనా ఇద్దరు ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..