Minister Harish Rao: మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి హారీష్ రావు.. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలింపు..
Minister Harish Rao: బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చి మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

Minister Harish Rao: తెలంగాణ రాష్ట్ర(Telangana) ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు మానవత్వాన్ని(Humanity) చాటుకున్నారు. సిద్ధిపేట జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. కారు దిగి బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చి మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం సాయంత్రం తిమ్మారెడ్డి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.. ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్తున్న క్రమంలో ప్రమాద జరిగిన సంఘటన జరిగింది. ఈ ప్రమాదాన్ని అటుగా ప్రయాణం చేస్తున్న మంత్రి హరీష్ రావు చూశారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి సంఘటనపై అరా తీశారు. బాధితులకు దైర్యం చెప్పిన మంత్రి హరీశ్ రావు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
