Hyderabad: నగరానికి ఏమౌతుంది?.. ఈరోజురోజుకీ పెరుగుతున్న మైనర్ డ్రైవర్స్.. సర్వత్రా ఆందోళన వ్యక్తం
ఈ మధ్య ఎక్కడ చూసినా బైక్ లేదా కారు నడుపుతున్న మైనర్లు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడుతున్నారు. అధికంగా మైనర్ల చలానాలు కనిపిస్తున్నాయి. ఇంటి పక్కన ఉన్న షాప్ కి వెళ్లాలన్నా ఇప్పుడు బైక్ కావాల్సిందే అన్నంతగా మారిపోయింది పరిస్థితి.
Hyderabad: తల్లిదండ్రులకి బాధ్యత లేకపోవడం వల్లనో లేదా పిల్లలు ఇష్టంతోనే..ఈ మధ్య ఎక్కడ చూసినా మైనర్ డ్రైవింగ్ చలాన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేసులు కూడా చాలా ఎకువుగా నమోదవుతున్నాయి.. ఏ ఇంటర్ కాలేజలకు, స్కూల్స్కు, లేదా పిల్లలూ ఎక్కువగా వెళ్ళే ప్రాంతంలో చూసినా వయసుతో పనిలేకుండా ప్రతి పిల్లవాడు బైక్ నడపడమే. మొత్తానికి బైక్ నడపడం ఓ స్టైల్ గా మారిపోయింది. అయితే ఈ మైనర్ డ్రైవింగ్ వల్ల వచ్చే నష్టం ఏంటో.. బండి నడుపుతున్న పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకి కూడా తెలియాల్సి ఉంది..
ఈ మధ్య ఎక్కడ చూసినా బైక్ లేదా కారు నడుపుతున్న మైనర్లు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడుతున్నారు. అధికంగా మైనర్ల చలానాలు కనిపిస్తున్నాయి. ఇంటి పక్కన ఉన్న షాప్ కి వెళ్లాలన్నా ఇప్పుడు బైక్ కావాల్సిందే అన్నంతగా మారిపోయింది పరిస్థితి. స్కూల్, కాలేజ్ , ఫంక్షన్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతి దానికి వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. అనంతరం.. డ్రైవింగ్ కేసులో దొరికిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య కాలం లో హైదరాబాద్ లో రకరకాల ప్రమాదాలను చూసాం..అవి అన్నీ మైనర్స్ డ్రైవింగ్ వల్లనే.
15 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న యువతీయువకులకు ఇంటి నుండి కాస్త దూరం వెళ్ళడానికి వాహనం కావాల్సిందే. అయితే ఇలా మైనర్స్ వాహనాలు నడపడం చట్ట ప్రకారం అది ఇల్లీగల్. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 181 ప్రకారం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే మైనర్లలని అరెస్ట్ చేయవచ్చు. అంతేకాదు సెక్షన్ 180 ప్రకారం పిల్లలకు వాహనాలను ఇచ్చిన వాహన యజమానులను కుడా అరెస్ట్ చేయచ్చు. సెక్షన్ 181 ప్రకారం వాహనం యజమానిపై కూడా కేసు కూడా నమోదు చేయవచ్చు. అంతేకాదు మైనర్ తో పాటు వాహనం యజమాని ఇద్దరూ కోర్టులో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
MV యాక్ట్ సెక్షన్ 206 ప్రకారం, మైనర్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే వాహనానికి చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్ (RC బుక్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) స్వాధీనం చేసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. ఒకవేళ అవి కూడా లేకపోతే.. సెక్షన్ 207 ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది.
ఇప్పుడు వరకూ హైదరాబాద్ లో 2026 కేసులు నమోదయ్యాయి..అలానే రూ. 81,200 జరిమానా వసూలు చేయబడ్డాయి.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత నాలుగేళ్లలో 45 మంది మైనర్లు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురయ్యారని హైదరాబాద్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఈ సంఖ్య కేవలం మైనర్లు డ్రైవింగ్ చేయడంతో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం మాత్రమే.. వీరి వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.
ట్రాఫిక్ పోలీస్ లు మైనర్ డ్రైవింగ్ పై ఛార్జ్ షీట్లు లు తయారుచేస్తున్నారు. లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడం ఇకపై సహించమని.. మైనర్ డ్రైవింగ్ కేసుల సంఖ్యను వీలైనంత తగ్గించాలని హైదరాబాద్ జాయింట్ సీపీ అన్నారు. ఈ కేసులకు సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాలని హైదరాబాద్ జాయింట్ సీపీ న్యాయవ్యవస్థకు లేఖ రాశారు..
పోలీసులతో పాటు తల్లిదండ్రులు కూడా సరైన బాధ్యత తీసుకోవాలని.. పిల్లలకు 18వయస్సు రాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ ని ఇవ్వ వద్దు అని సామజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. మైనర్లు ఎక్కువగా తిరిగే చోట పోలీసులు తనిఖీలు అధికంగా నిర్వహించాలని చెప్పారు. అప్పుడే మైనర్ డ్రైవింగ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..