Jubilee Hills Rape Case: రేప్ కేసు మైనర్లకు రాజభోగాలు.. విచారణ సాగుతుండగానే వీఐపీ ట్రీట్మెంట్..
పోలీస్ స్టేషన్‌లోకి స్టార్ హోటల్ బిర్యానీని అనుమతిస్తూ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ తర్వాత ఐదుగురు మైనర్లకు జూబ్లీహిల్స్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కస్టడీ సమయంలో నిందితుల భోజన వసతి చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. ఇదే అవకాశంగా..
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ రేప్ కేసు మైనర్లు రాజభోగాలు అనుభవిస్తున్నారు. మైనర్లకు విచారణ సాగుతుండగానే వీఐపీ హోదా కల్పిస్తున్నారు కొందరు ఖాకీలు. పోలీస్ స్టేషన్‌లోకి స్టార్ హోటల్ బిర్యానీని అనుమతిస్తూ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ తర్వాత ఐదుగురు మైనర్లకు జూబ్లీహిల్స్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కస్టడీ సమయంలో నిందితుల భోజన వసతి చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. ఇదే అవకాశంగా తీసుకున్న మైనర్ల కుటుంబసభ్యులు స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించారు. ఆ బిర్యానీని యథాతథంగా పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించారు పోలీసులు. వీఐపీ నిందితుల విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరించే పోలీసులు.. ఈ కేసులోనూ అదే దారిలో నడుస్తున్నారు. బాలికపై రేప్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఘటనా స్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు. మైనర్లతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపినట్టు గుర్తించిన పోలీసులు.. వారి వద్ద ఉన్న ఆధారాలతో అదే ప్రాంతంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అయితే పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విచారణ సమయంలో ఇలా వ్యవహరిస్తే నిజాలు ఎలా వెలుగు చూస్తాయిన మండిపడుతున్నాయి.
అయితే.. ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడీకి ఈ రోజే చివరి రోజు. మిగతా ఐదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్ కలిపి ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. నిన్న నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో పొటెన్సీ టెస్టులు నిర్వహించారు. సాదుద్దిన్‌తో సహా ముగ్గురు మైనర్లను .. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు పలు కోణాల్లో వివరాలు రాబడుతున్నారు.
ఈ రేప్ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది. మైనర్ బాలిక మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలయ్యాయి. టాటూలా ఉండాలని మెడపై కొరికినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు నిందితులు ఒప్పుకున్నారు.
ఇక విచారణలో రేప్ ఘటనను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు నిందితులు. సాదుద్దిన్ తమను రెచ్చగొట్టాడని మిగతా నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే అసభ్యంగా ప్రవర్తించింది మైనర్లే అంటున్నాడు సాదుద్దిన్ మాలిక్.