Huzurabad By Election: హుజూరాబాద్‌లో వేడెక్కుతున్న రాజకీయాలు.. ఈటల రాజేందర్‌పై విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌రావు
Huzurabad By Election: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎవరికి వారు పోరు కొనసాగిస్తున్నారు..
Huzurabad By Election: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎవరికి వారు పోరు కొనసాగిస్తున్నారు. ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయడంతో టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రచారంలో కూడా టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు ప్రజల కడుపులు నింపవని ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని, అంతేకాకుండా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీర్ కిట్ పనికి రాదని, రైతుంబంధు దండగ.. ఆసరా పెన్షన్ పరిగ ఏరుకున్నట్లు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడని హరీష్‌రావు దుయ్యబట్టారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏ మేరకు చేరాయో తమకు తెలుసన్నారు. నీవు శ్రీమంతుడివి.. నీకు అవసరం లేకపోవచ్చు.. ఆసరా పెన్షన్ ఎందరికో కొండంత ఆత్మవిశ్వాసం కల్పిచిందన్నారు.
హుజూరాబాద్‌కు ఈటల ఏం చేశాడు..
ఈటల రాజేందర్ హుజూరాబాద్‌కు ఏం చేశాడని అడుగుతున్నా.. గెల్లు శ్రీనుకు ఒక్క సారి అవకాశం ఇవ్వండి.. ఈ ప్రాంతం నాకు అన్నం పెట్టింది.. నచ్చిన ఊరు సింగాపూర్. నేను కానీ, కేసీఆర్‌కు గానీ ఆతిధ్యం ఇ్చచిన ఊరు. అబద్దాల బీజేపీ మాటలు నమ్మవద్దు అంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
ఈటల గెలిచేది లేదు.. మంత్రి అయ్యేది లేదు..
ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచేదేమి లేదు.. మంత్రి అయ్యేది లేదని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ధరలను పెంచిన బీజేపీని ప్రజలు ఎందుకు గెలిపిస్తారని అన్నారు. మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా కష్టపడి పని చేసి మీ రుణం తీర్చుకుంటామని హరీష్ రావు అన్నారు.
ఇవీ కూడా చదవండి: Biryani Leaf: బిర్యానీ ఆకు సాగుతో లక్షల్లో సంపాదన.. కేవలం 50 మొక్కలతో ఆదాయం ఎంతో తెలిస్తే..